* జూన్ లో జూనియర్ ఇంజిరీర్లు, జులైలో సీహెచ్ ఎస్ ఎల్ పరీక్షలు
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఏప్రిల్, జూన్ నెలల్లో జరగాల్సిన పలు పరీక్షల తేదీల్లో మార్పులను ప్రకటించింది. దాంతోపాటు సీహెచ్ ఎస్ ఎల్ కు కొత్తగా పరీక్షల తేదీలను వెల్లడించింది. దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కొత్త షెడ్యూల్ విడుదల చేసింది. జూన్ 4, 5, 6 తేదీల్లో జరగాల్సిన జూనియర్ ఇంజినీర్ పరీక్షలను జూన్ 5, 6 7 తేదీల్లో నిర్వహిస్తారు మే 9, 10, 13ల్లో జరగాల్సిన దిల్లీ పోలీస్ (ఎస్ఐ, సీఏపీఎఫ్) పరీక్షలు జూన్ 27, 28, 29 తేదీలకు వాయిదా వేశారు. మే 6, 7, 8 తేదీల్లో నిర్వహించాల్సిన సెక్షన్ పోస్టు ఎగ్జామినేషన్ ఫేజ్ – X!! జూన్ 24, 25, 26 తేదీల్లో జరుగుతుంది. పదో తరగతి అర్హతతో జరిగే కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ (సీహెచ్ ఎస్ ఎల్) పరీక్షలు జులై 1 నుంచి 12 వరకు జరుగుతాయి.
కొత్త పరీక్షల తేదీల షెడ్యూల్ కోసం క్లిక్ చేయండి
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.