తెలంగాణలో ఇటీవల 11,062 ఖాళీలతో వెలువడిన డీఎస్సీ /టీఆర్ టీ (టీచర్ రిక్రూట్ మెంట్ టెస్ట్) నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకున్న ఎస్సీ అభ్యర్థులకు ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు హైదరాబాద్ లోని రాష్ట్ర షెడ్యూల్డ్కులాల స్డడీ సర్కిల్ శనివారం (మార్చి9న) ఒక ప్రకటనలో తెలియజేసింది. ఏప్రిల్15 నుంచి జూన్14 వరకు 2 నెలల పాటు ఈ శిక్షణ ఇస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు మార్చి 12 నుంచి 26 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ డైట్, బీ,ఎడ్కాలేజీలు ఉన్న కేంద్రాలతో పాటు ఎంపిక చేసిన ఇతర కళాశాలతో కలిపి మొత్తం 16 ప్రాంతాల్లో , ప్రతి కేంద్రానికి 100 మందికి చొప్పున ఉచిత కోచింగ్ఇస్తారు. అభ్యర్థులు డైట్ (DIET) లేదా టెట్(టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) ఉత్తీర్ణులై ఉండాలి. పూర్తి వివరాలు మార్చి 11 నుంచి వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటాయి.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.