• facebook
  • whatsapp
  • telegram

UPSC Civils Interview: సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ తేదీల వెల్లడి

* ఎంపికైన అభ్యర్థులు వీరే..
 

* త్వరలో అందుబాటులో కాల్‌ లెటర్లు

ఈనాడు ప్రతిభ డెస్క్‌: యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ఆధ్వర్యంలో నిర్వహించిన సివిల్ సర్వీసెస్ 2023 ఫేజ్‌-2 ఇంటర్వ్యూ తేదీలను యూపీఎస్సీ వెల్లడించింది. ఫేజ్‌-2లో ఎంపికైన అభ్యర్థులకు ఫిబ్రవరి 19 నుంచి మార్చి 15 వరకు ముఖాముఖి పరీక్షలు నిర్వహించనున్నారు. డిసెంబర్‌లో ఫేజ్‌-1 జాబితా వెలువడిన విషయం తెలిసిందే. అభ్యర్థుల రోల్‌ నంబర్‌, ఇంటర్వ్యూ తేదీ, సమయం వివరాలను యూపీఎస్సీ ప్రకటించింది. త్వరలోనే ఇ-సమన్‌ లెటర్లు వెబ్‌సైట్‌లో పొందుపరచనున్నట్లు కమిషన్‌ పేర్కొంది. సెప్టెంబ‌ర్ 15వ తేదీ నుంచి 24వ తేదీ వ‌ర‌కు సివిల్స్‌ ప్రధాన పరీక్షల నిర్వహణ; డిసెంబర్‌ 8న ఫలితాలు విడుదలయ్యాయి. మెయిన్స్‌లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఇంటర్వ్యూ(పర్సనాలిటీ టెస్ట్‌)కు హాజరు కావాల్సి ఉంటుంది. రాత పరీక్ష(ప్రిలిమ్స్, మెయిన్స్), ఇంటర్వ్యూ, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
 

సివిల్స్‌ ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థులు, తేదీల వివరాలు
 

ఫేజ్‌-1 జాబితా 


ఫేజ్‌-2 జాబితా


 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 25-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.