• facebook
  • whatsapp
  • telegram

APPCET: జూన్‌ 11 నుంచి ఏపీపీఈసెట్ ఎంపికలు

ఎ.ఎన్‌.యు, న్యూస్‌టుడే: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వ్యాయామ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీపీఈసెట్ ఎంపికలను జూన్‌ 11 నుంచి నిర్వహిస్తున్నామని కన్వీనర్‌ ఆచార్య జాన్సన్‌ మార్చి ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు. డీపీఈడీ, బీపీఈడీ కోర్సుల్లో చేరే విద్యార్థులు మే 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కన్వీనర్‌ వెల్లడించారు. రూ.500 అపరాధ రుసుంతో మే 22 వరకు, రూ.1,000 అపరాధ రుసుంతో మే 29 వరకు చెల్లించవచ్చన్నారు. మే 30, 31 తేదీల్లో సవరణకు అవకాశం కల్పించామని తెలిపారు. జూన్‌ 4 నుంచి హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని.. జూన్‌ 11 ఉదయం 6 గంటల నుంచి ఎంపికలు నిర్వహిస్తామన్నారు.




మరింత సమాచారం... మీ కోసం!

‣ షిప్పింగ్‌ కోర్సులతో మేటి అవకాశాలు

‣ మార్కెట్‌ మందగమనంలో ఉద్యోగ సాధన!

‣ స్పీచ్‌, హియ‌రింగ్ చికిత్స‌లో ప్ర‌త్యేక కోర్సులు

‣ ఇంటర్మీడియ‌ట్‌తో ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ

‣ జీవ శాస్త్రాల్లో కొలువుకు విస్తృత అవకాశాలు

‣ మ‌లిద‌శ ప‌రీక్ష‌లో గెలుపు వ్యూహం!

‣ కొత్త అవకాశాలకు.. జెన్‌ ఏఐ!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 29-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.