• facebook
  • whatsapp
  • telegram

UPSC: 21న యూపీఎస్సీ పరీక్ష

ఎన్టీఆర్‌ కలెక్టరేట్, న్యూస్‌టుడే: విజయవాడ నగరంలో ఏప్రిల్‌  21వ తేదీన యూపీఎస్సీ పరీక్షలు జరగనున్నాయి. దీనికి సంబంధించి పక్కా ఏర్పాట్లు చేయాలని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై నగరంలో ఎంజీ రోడ్డులోని కలెక్టరేట్‌లో శుక్రవారం సమీక్షించారు. నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ, నేవల్‌ అకాడమీ, కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీస్‌ (సీడీఎస్‌) పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు. జిల్లాలో మొత్తం 1,872 మంది అభ్యర్థులు హాజరు కానుండగా, 5 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేసినట్టు ఈ సందర్భంగా పేర్కొన్నారు. కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ బొగ్గు గనుల్లో కొలువులు

‣ ఆధునిక అవకాశాలకు న్యాయ విద్య!

‣ రాబోయే రోజుల్లో ఉద్యోగార్థుల సన్నద్ధత ఇలా..

‣ ఎన్‌ఐఎన్‌ కోర్సులతో మెరుగైన అవకాశాలు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 20-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.