• facebook
  • whatsapp
  • telegram

Education: ‘హైస్కూల్‌ తర్వాతే లా ప్రాక్టీస్‌ చేస్తే పోలే’

12వ తరగతి తర్వాత అయిదేళ్లు చదవాల్సిన ఎల్‌ఎల్‌బీ కోర్సును మూడేళ్లకు తగ్గించడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం, బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాకు ఆదేశాలు జారీచేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘మూడేళ్లు కూడా ఎందుకు..? హైస్కూల్‌ పూర్తవగానే నేరుగా లా ప్రాక్టీస్‌ మొదలు పెట్టేయండి’’ అంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై చంద్రచూడ్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘‘నా మటుకు అయిదేళ్లు కూడా చాలా తక్కువ’’ అని వ్యాఖ్యానించారు. న్యాయ వృత్తిలో పరిణతి కలిగిన వారి అవసరం ఉందని, ఇందుకు అయిదేళ్ల కోర్సు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని పేర్కొన్నారు. సుదీర్ఘమైన ఈ అయిదేళ్ల కోర్సు వల్ల విద్యార్థులపై అధిక ఆర్థిక భారం పడుతోందని, ఇది మూడేళ్లకు తగ్గితే పేదలకు, ముఖ్యంగా మహిళలకు ఎంతగానో ప్రోత్సాహం లభిస్తుందంటూ అశ్వినీ ఉపాధ్యాయ్‌ పిటిషన్‌లో తెలిపారు. బ్రిటన్‌లోనూ మూడేళ్ల కోర్సునే అవలంభిస్తున్నారని ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. ఈ వాదనను తిరస్కరించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ జె.బి.పార్దీవాలాలతో కూడిన ధర్మాసనం.. ఈ ఏడాది 70% మంది మహిళలు జిల్లా స్థాయి న్యాయస్థానాల్లో ప్రవేశించారని, ఎంతో మంది బాలికలు చట్టాన్ని చదివేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిపింది. ప్రస్తుతం ఉన్న ఎల్‌ఎల్‌బీ కోర్సు బాగానే ఉందని దీనిపై పునరాలోచించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అభ్యర్థనను ఉపసంహరించుకునేందుకు అనుమతి ఇస్తున్నట్లు పేర్కొంది.
 


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ కోచింగ్‌ లేదు... డెయిలీ టార్గెట్స్‌ పూర్తీచేశా!

‣ టెక్నికల్‌ గ్రాడ్యుయేట్లకు ఆర్మీ ఆహ్వానం!

‣ బొగ్గు గనుల్లో కొలువులు

‣ ఆధునిక అవకాశాలకు న్యాయ విద్య!

‣ రాబోయే రోజుల్లో ఉద్యోగార్థుల సన్నద్ధత ఇలా..

Published Date : 23-04-2024 12:13:45

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం