* జులై 7వ తేదీన పరీక్ష
ఈనాడు ప్రతిభ డెస్క్: సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) జులై 2024 సిటీ ఇంటిమేషన్ స్లిప్పులను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) విడుదల చేసింది. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్ నమోదు చేసి పరీక్ష కేంద్రం వివరాలను తెలుసుకోవచ్చు. ఈ స్లిప్పులో పరీక్ష కేంద్రం, నగరం, తేదీ, సమయం, విధివిధానాలు తదితర సమాచారం ఉంటుంది. త్వరలో అడ్మిట్ కార్డులు (Admit Card) విడుదల కానున్నాయి. దేశవ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో జులై 7న పరీక్ష జరగనుంది. సీటెట్ పరీక్ష ప్రతి ఏడాది రెండుసార్లు జరుగుతుంది.
సీటెట్ జులై-2024 సిటీ ఇంటిమేషన్ స్లిప్పుల కోసం క్లిక్ చేయండి
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.