1. లోక్సభ నియోజకవర్గాలకు దాఖలైన 267 మంది నామినేషన్ల తిరస్కరణ
తెలంగాణ రాష్ట్రంలోని లోక్సభ నియోజకవర్గాలకు దాఖలైన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పూర్తయింది. మొత్తం 17 స్థానాలకు 893 మంది నామినేషన్లు వేయగా 267 మంది అభ్యర్థుల పత్రాలను తిరస్కరించిన అధికారులు 626 మందివి నిబంధనల మేరకు ఉన్నట్లు ప్రకటించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. 100% వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు అసాధ్యం
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం)పై వ్యక్తమవుతున్న అనుమానాలను సర్వోన్నత న్యాయస్థానం నిర్ద్వంద్వంగా కొట్టిపారేసింది. ఓట్ల లెక్కింపు సమయంలో ఈవీఎంల్లో నమోదైన ఓట్లను వీవీప్యాట్ స్లిప్పులతో సరిపోల్చి చూడాలని కోరుతూ దాఖలైన పిటిషన్లనూ తోసిపుచ్చింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. దక్షిణాదిలో నీటి సంక్షోభం!
దక్షిణ భారతదేశం తీవ్ర నీటి సంక్షోభంలో చిక్కుకుంది. ఆ ప్రాంతంలోని రిజర్వాయర్ల సామర్థ్యంలో 17 శాతం మేర మాత్రమే నీరు ఉందని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) తాజా బులెటిన్ పేర్కొంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. ఫైనల్లోకి భారత కాంపౌండ్ మిక్స్డ్ జట్టు
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి వెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. సెమీఫైనల్లో సురేఖ- అభిషేక్ జోడీ 155-151తో ఆండ్రియా బెకెరా- మాక్సిమో మెండెజ్ (మెక్సికో) జంటపై విజయం సాధించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. ప్రిన్స్టన్ యూనివర్సిటీలో భారత సంతతి విద్యార్థిని అరెస్టు
ప్రిన్స్టన్ యూనివర్సిటీలో భారత సంతతి విద్యార్థిని అచింత్య శివలింగన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడులోని కోయంబత్తూరులో జన్మించిన అచింత్య ప్రిన్స్టన్లో గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కోసం క్లిక్ చేయండి...
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.