* మే 6, 7వ తేదీల్లో పరీక్ష
ఈనాడు ప్రతిభ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2024 (ఏపీ ఐసెట్) హాల్టికెట్లను రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్, క్వాలిఫయింగ్ ఎగ్జామ్ హాల్టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలతో హాల్టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. పరీక్షను అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం(ఎస్కేయూ) నిర్వహించనుంది. ఈ ప్రకటన ద్వారా 2024 విద్యా సంవత్సరానికి ఏపీ రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలు, అనుబంధ కళాశాలల్లో ఫుల్ టైం ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అభ్యర్థులకు మే 6, 7వ తేదీల్లో ప్రవేశ పరీక్ష రెండు షిఫ్టుల్లో నిర్వహిస్తారు. మే 8న ప్రిలిమినరీ కీ, జూన్ 20న ఫలితాలు వెలువడనున్నాయి.
Download Hallticket for AP ICET-2024
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.