• facebook
  • whatsapp
  • telegram

బడి మానేసిన విద్యార్థుల‌పై విద్యాశాఖ దృష్టి

క‌రీంన‌గ‌ర్ ఉమ్మడి జిల్లాలో 1804 మంది బాలలు
 


 

న్యూస్‌టుడే-కరీంనగర్‌ విద్యావిభాగం: కొత్త విద్యాసంవత్సరంలో చదువుకు దూరంగా ఉంటున్న విద్యార్థులను తిరిగి బడి బాట పట్టించేందుకు విద్యాశాఖ సన్నద్ధమవుతోంది. వివిధ కారణాలు, ఆరిక అవసరాలతో గత విద్యాసంవత్సరంలో ఉమ్మడి జిల్లాలోని విద్యార్థులు పలువురు అర్ధాంతరంగా చదువు మానేశారు. కొందరు పనులకు  వెళ్లగా, మరి కొందరు ఇళ్లకే పరిమితమయ్యారు. విద్యాహక్కు చట్టం ప్రకారం 6-14 ఏళ్లలోపు బాలలు తప్పనిసరిగా బడులకు వెళ్లి చదువుకోవాలని ఉన్నా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలువురు పాఠశాలలకు దూరంగా నిలుస్తున్నారు. వీరికి తోడు 15-19 ఏళ్లలోపు విద్యార్థులు కూడా వివిధ కారణాలతో ఉన్నత విద్యను మధ్యలో మానేశారు. ఇలాంటి వారిని గుర్తించి ప్రోత్సహించేందుకు ఉమ్మడి జిల్లాలో మండలాల వారీగా గత విద్యాసంవత్సరం చివరలో సర్వేను చేపట్టి బడి బయట విద్యార్థులను గుర్తించాయి. కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో వారందరిని చదువుల బాట పట్టించేందుకు కార్యాచరణను అమలు చేయనున్నారు.

‣ బడులకు దూరంగానే...

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1804 మంది విద్యార్థులు చదువులకు దూరంగా నిలుస్తున్నట్లు విద్యాశాఖ సర్వేలో తేలింది.

వీరిలో 6-14 ఏళ్లలోపు బడీఈడు పిల్లలే అధికంగా ఉన్నారు. 1247 మంది బడీఈడు పిల్లలకు పాఠశాలలకు దూరంగా ఉండగా, 15-19 ఏళ్లలోపు వయస్సు కల్గి చదువులను అర్ధాంతరంగా మానేసిన విద్యార్థులు 557 మంది ఉన్నారు. 

గత ఏడు కరోనా, లాక్‌డౌన్‌ కారణంగా వీరి సంఖ్య ఎక్కువగా నిలిచినా అంతకు ముందు విద్యాసంవత్సరాల్లో కూడా ఇంచు మించుగా ఇదే సాయిలో నిలుసోంది. ప్రతి ఏటా జిల్లా విద్యాశాఖలు క్షేత్రసాయిలో సర్వేలు చేసి వారిని బడుల్లో చేర్పిస్తున్నట్లు చెబుతున్నా చదువులకు దూరంగా నిలుస్తున్న విద్యార్థులు ప్రతి ఏటా పుట్టుకుస్తూనే ఉన్నారు.

సంచార జాతులు, వలస కార్మికుల పిల్లలతో పాటు ఆరిక ఇక్కట్లతో తల్లిదండ్రులు పిల్లలను ఇళ్లకే పరిమితం చేస్తున్నట్లు ఉమ్మడి జిల్లాలో విద్యాశాఖలు చేసిన సర్వేలో గుర్తించారు. 

 

‣ అందరూ చదివేలా..

కొత్త విద్యాసంవత్సరం జూన్‌ 16 నుంచి ప్రారంభమయ్యేలా విద్యాశాఖ చర్యలు తీసుకుంటుంది. చదువుకు దూరమైన విద్యార్థుల వివరాలను విద్యాశాఖకు సంబంధించిన ఛైల్డ్‌ఇన్ఫో, ప్రబంధ్‌ పోర్టల్‌లో జిల్లా విద్యాశాఖలు నమోదు చేయాలని రాష్ట్ర విద్యాశాఖ డీఈవోలకు ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలోని పాఠశాలల సముదాయాల వారీగా వాటి పరిధిలో సర్వే ద్వారా గుర్తించిన విద్యార్థుల వివరాలను నమోదు చేయనున్నారు. ఈ వివరాల ఆధారంగా తిరిగి సర్కారు బడులు, కేజీబీవీలు, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చేర్పించేలా విద్యాశాఖ కార్యాచరణ రూపొందిస్తోంది. ఉమ్మడి జిల్లాలోని పాఠశాలల సముదాయాల ప్రధానోపాధ్యాయులు, సీఆర్పీలు, ఎంఈవోలు సర్వేలో గుర్తించి విద్యార్థుల వివరాలను జూన్ 09న‌ నుంచి నమోదు చేయడంలో నిమగ్నమయ్యారు. జూన్‌ 15 నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నారు.

Posted Date : 10-06-2021