• facebook
  • whatsapp
  • telegram

త్వ‌ర‌లో జేఈఈ మెయిన్‌ సెష‌న్‌-3 ఫ‌లితాలు..

 

 

దిల్లీ: జేఈఈ మెయిన్‌ సెష‌న్‌-3 ప‌రీక్షా ఫ‌లితాల విడుద‌ల తేదీ త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్నారు. జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) నిర్వ‌హించిన‌ ఈ ఫ‌లితాల‌తో పాటు క‌ట్ ఆఫ్ మార్కులు, స్కోర్ కార్డుల‌ను ఎన్‌టీఏ విడుద‌ల చేయ‌నుంది. జాతీయ స్థాయిలో జులై 20 నుంచి 27 వ‌ర‌కు ఈ ప‌రీక్ష‌లు నిర్వ‌హించగా, మ‌హారాష్ట్రలో మాత్రం వ‌ర‌ద‌లు, ప్ర‌కృతి విప‌త్తుల కార‌ణంగా ఆగ‌స్టు 3, 4 తేదీల‌లో నిర్వ‌హించారు. ఈ ఏడాది జేఈఈ మెయిన్‌ థ‌ర్డ్ సెష‌న్ కోసం సుమారు 7 ల‌క్ష‌ల మంది విద్యార్థులు రిజిస్ట‌ర్ చేసుకున్నారు. 

Posted Date : 04-08-2021