• facebook
  • whatsapp
  • telegram

Navodaya: నవోదయ దరఖాస్తు గడువు పెంపు

కొమ్మాది, న్యూస్‌టుడే: కొమ్మాది జవహర్‌ నవోదయ విద్యాలయంలో రానున్న విద్యా సంవత్సరం (2024-25)లో 9, 11 తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు తేదీని నవంబరు 15వ తేదీ వరకూ పెంచినట్లు ప్రిన్సిపల్‌ కె.సంజయ్‌ తెలిపారు. ఆయా తరగతుల్లో మిగులు సీట్ల భర్తీకి నిర్వహించే ఈ ప్రవేశ పరీక్షకు విశాఖ జిల్లాలో ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ప్రస్తుత విద్యాసంవత్సరంలో 8, 10 చదువుతున్న విద్యార్థులు అర్హులన్నారు. ఆన్‌లైన్‌ పద్ధతిలో ‌www.navodaya.gov.in  వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని, ఇతర వివరాలన్నీ అందులోనే అందుబాటులో ఉంటాయన్నారు. ఇప్పటికే దరఖాస్తు చేసిన వారు నమోదు చేసిన వివరాలు సరి చేసుకునేందుకు నవంబరు 16, 17 తేదీల్లో అవకాశం ఉంటుందన్నారు.
 


మరింత సమాచారం... మీ కోసం!

‣ అగ్రరాజ్యంలో అడ్మిషన్లు ఇలా!

‣ ఆత్మవిశ్వాసంతో అద్భుత విజయాలు!

‣ రెజ్యూమె రాయడంలో జాగ్రత్తలు

‣ కొలువు సాధనకు తొలి అడుగు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 08-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.