• facebook
  • whatsapp
  • telegram

Jobs: 4 కేటగిరీ పోస్టుల భర్తీ విధానంపై అధికారులకు అవగాహన

క్రీడాకారులు, దివ్యాంగులు, మహిళలు, మాజీ సైనికోద్యోగుల కేటగిరిలో..
మళ్లీ 29న సచివాలయంలో భేటీ

ఈనాడు, అమరావతి: రోస్టర్‌ పాయింట్‌ల ఖరారులో చేసిన మార్పుల గురించి సాధారణ పరిపాలన శాఖ వివిధ ప్రభుత్వ శాఖల అధికారులకు వివరించింది. ఉద్యోగాల భర్తీ రిజర్వేషన్‌ ప్రకారం.. కొత్తగా జారీచేసిన జీఓ 77 ప్రకారం రోస్టర్‌ పాయింట్‌ల అమల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రాష్ట్ర సచివాలయంలో న‌వంబ‌రు 24న‌ జరిగిన సమావేశంలో సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి (సర్వీసెస్‌) పోలా భాస్కర్‌ తెలిపారు. ముఖ్యంగా క్రీడాకారులు, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులు, మహిళలకు కేటాయించిన నిష్పత్తి ప్రకారం ఉద్యోగాల భర్తీలో రోస్టర్‌ పాయింట్స్‌ను ఎలా నిర్ధారించాలన్న దానిపై వివరించారు. ఈ విధానం అమలుపై అందజేసిన నమూనా ఆధారంగా వివరాలతో ఈ నెల 29న సచివాలయంలో జరిగే సమావేశానికి హాజరుకావాలని ఆదేశించారు.
కొత్త విధానం
ప్రస్తుతం విధానంలో మెరిట్‌ను బట్టి మహిళలకు ఓపెన్‌ కేటగిరిలలో పోస్టులు కేటాయిస్తున్నారు. అలాగే 33 శాతం రిజర్వేషన్‌లలోనూ పోస్టులు నింపుతున్నారు. తాజా నిర్ణయం ప్రకారం..ఓపెన్‌ కేటగిరిలో రిజర్వేషన్‌ పోస్టుల భర్తీకి  క్రీడాకారులకు కేటాయించిన 2శాతం పోస్టులు మెరిట్‌ ప్రకారం భర్తీ అయితే. స్పోర్ట్స్‌ కోటా కింద ఉద్యోగ అవకాశాలు ఉండవు. ఇదే విధానం దివ్యాంగులు 4శాతం మాజీ సైనికోద్యోగుల 2శాతంకు వర్తిస్తుంది. గతంలో ఈ 4 కేటగిరిలకు ప్రత్యేకంగా రోస్టర్‌ పాయింట్లు ఉండేవి. రిజర్వేషన్‌ ప్రకారం పోస్టుల భర్తీకి ప్రాధాన్యం ఇచ్చేవిధంగా ఈ విధానాన్ని అమలుచేస్తారు. మాజీ సైనికోద్యోగులకు రిజర్వేషన్‌ అమలు క్లరికల్‌ ఉద్యోగాల్లో మాత్రమే ఉంది.
30లోగా నోటిఫికేషన్ల జారీ జరిగేనా?
రోస్టర్‌ పాయింట్‌ వివరాలు ఆయా శాఖల నుంచి అందితేనే ఏపీపీఎస్సీ తొలుత ప్రకటించిన ప్రకారం... ఈ నెలాఖరుకు గ్రూపు-1, గ్రూపు-2 నోటిఫికేషన్ల జారీకి అవకాశం ఉంది. లేదంటే మరికొంత జాప్యం తప్పదు. కొత్త మార్పులపై నిర్ణయం తీసుకుని చాలాకాలమైనా.. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ప్రస్తుతం హడావుడి పెరిగింది. నోటిఫికేషన్ల జారీ సమయంలో భర్తీచేసిన పోస్టులకు వర్తింపజేసిన రోస్టర్‌ పాయింట్లకు అనుగుణంగా కొత్త పోస్టులకు రిజర్వేషన్లను ప్రభుత్వ శాఖలు ఖరారుచేస్తాయి. తాజా మార్పుల దృష్ట్యా రోస్టర్‌ పాయింట్‌ విధానంలో పోస్టులు ఎలా భర్తీచేయాలన్న దానిపై అధికారుల్లో సందిగ్ధత నెలకొంది. వీటి నివృత్తి కోసమే సచివాలయంలో శుక్రవారం ప్రత్యేక సమావేశం జరిగింది. గ్రూపు-1 కింద 88, గ్రూపు-2 కింద 989 పోస్టులతో కలిపి మొత్తం 1,604 పోస్టుల భర్తీకి ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్లు ఇస్తామని ఏపీపీఎస్సీ నవంబరు 1న అధికారిక ప్రకటన చేసింది. 29న సమావేశం పెడితే.. ఇక మధ్యలో ఒక్కరోజే ఉంటుంది. ఈ ఒక్క రోజులోనే తతంగాలన్నీ పూర్తిచేసి, నోటిఫికేషన్‌ ఇవ్వడం సాధ్యమేనా అన్నది అనుమానంగానే కనపడుతోంది.

మరింత సమాచారం... మీ కోసం!

‣ నేరాల గుట్టు పట్టే కోర్సులు

‣ సందేహాలా?.. ఐఐటియన్ల సలహాలివిగో..!

‣ దిల్లీ ఆసుపత్రుల్లో ఉద్యోగ అవకాశాలు

‣ సమస్యా పరిష్కార నైపుణ్యం.. భవిష్యత్ ప్రాధాన్యం

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 25-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.