• facebook
  • whatsapp
  • telegram

Admissions: కోరుకొండ సైనిక పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తులు 

ఎన్టీఆర్‌ కలెక్టరేట్, న్యూస్‌టుడే : విజయనగరం జిల్లా కోరుకొండ సైనిక పాఠశాలలో ప్రవేశానికి 2024, జనవరి 21న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్టు కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు తెలిపారు. డిసెంబరు 16న సాయంత్రంలోగా నిర్ణీత పరీక్ష ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. 2024-25 విద్యా సంవత్సరానికి నిర్వహించే ఈ ప్రవేశ పరీక్షకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సాధారణ (జనరల్‌), డిఫెన్స్, మాజీ సైనికులు, ఇతర వెనుకబడిన తరగతులకు చెందిన వారు రూ.650, ఎస్సీ, ఎస్టీలు రూ.500 చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉందన్నారు. ఆన్‌లైన్‌లో పేమెంటు గేట్‌ వే ద్వారా/డెబిట్, క్రెడిట్‌ కార్డులు/ఇంటర్‌ నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని సూచించారు. పాఠశాల వెబ్‌సైట్‌: www.sainikschoolkorukonda.org ఆన్‌లైన్‌లో దరఖాస్తులను సమరించాలన్నారు. మీడియం, పరీక్ష సిలబస్, రిజర్వేషన్, ఫీజు, పరీక్షా కేంద్రాలు తదితర వివరాల కోసం వెబ్‌సైట్‌: www.nta.ac.in/https:///exams.nta.ac.in/aissee లో చూడవచ్చన్నారు.
 

మరింత సమాచారం... మీ కోసం

‣ బాడీ లాంగ్వేజ్ ఎందుకు ముఖ్యం?

‣ దిద్దుబాటుతో విజయం తథ్యం!

‣ వాయుసేనలో విశిష్ట ఉద్యోగాలు

‣ 995 ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ కొలువులు

‣ వైరాలజీ సంస్థలో ఉద్యోగాలు

‣ డేటా లిటరసీ.. సరికొత్త నైపుణ్యం!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 07-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.