• facebook
  • whatsapp
  • telegram

JNTUH: వినూత్నంగా ఆన్‌లైన్‌ పాఠాలు

* ప్రత్యక్ష ప్రసారం.. విద్యార్థులతో ముఖాముఖి

* జేఎన్‌టీయూలో ప్రత్యేక స్టూడియో.

.

ఈనాడు,హైదరాబాద్‌, కూకట్‌పల్లి న్యూస్‌టుడే: జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ఇకపై ఇంజినీరింగ్‌ విద్యార్థులకు వినూత్నంగా ఆన్‌లైన్‌ పాఠాలను బోధించనుంది. ఇంజినీరింగ్‌ విద్యలో కృత్రిమమేధ, డేటాసైన్స్‌, చాట్‌జీపీటీ ,సైబర్‌ భద్రత కోర్సులపై మరింత అవగాహన కల్పించేందుకు ఆచార్యులతో పాటు వృత్తినిపుణులతో తరగతులను నిర్వహించనుంది. వీరు చెప్పే పాఠాలను జేఎన్‌టీయూ అధికారులు ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఇందుకోసం విశ్వవిద్యాలయంలో ఒక స్టూడియో ఏర్పాటు చేశారు. ప్రసార మాధ్యమాల ప్రత్యక్ష ప్రసారం తరహాలో ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. శాటిలైల్‌ లింకులతో అనుసంధానం చేశారు. ఆచార్యులు, నిపుణులు బోధించే పాఠాలు జేఎన్‌టీయూకు అనుబంధంగా ఉన్న 140 ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ఏకకాలంలో ప్రసారమవుతాయి. కొత్త సంవత్సరం నుంచి తరగతులను ప్రారంభించనున్నామని జేఎన్‌టీయూ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ మంజూర్‌ హుస్సేన్‌ తెలిపారు.

నేరుగా సందేహాల నివృత్తి..

పాఠం బోధిస్తున్న వారితో ఆన్‌లైన్‌ ద్వారా నేరుగా మాట్లాడే సౌకర్యం ఉంది. ఇందుకోసం జేఎన్‌టీయూ అధికారులు తరగతుల్లో మైకులను అనుసంధానం చేశారు. దీని వల్ల విద్యార్థులకు పాఠం అర్థం కాకపోయినా, కొత్త విషయాలు తెలుసుకోవాలన్నా వారు ఆచార్యులను ప్రశ్నించేందుకు వీలుంటుంది. కళాశాల పరిసర ప్రాంతాలు, ఇళ్లల్లో విద్యార్థులు గుర్తించిన అంశాలను ఆచార్యులతో చర్చించేందుకూ అవకాశాలున్నాయి.

రికార్డుల్లో భద్రం..

జేఎన్‌టీయూ స్టూడియో నుంచి అనుబంధ ఇంజినీరింగ్‌ కళాశాలల విద్యార్థులకు ప్రత్యక్ష ప్రసారం చేసినప్పుడు కొన్ని కళాశాలల విద్యార్థులు అవసరం లేదనుకుంటే వీడియోలను పాఠాలుగా మార్చి స్టూడియోలో భద్రపరుస్తారు. ఎప్పటికప్పుడు విద్యార్థులకు కొత్త తరహాలో బోధించేందుకు, వారి సందేహాలను నివృత్తి చేసేందుకు ఈ విధానాన్ని ఎంచుకున్నారు. ఈ పాఠాలను బోధించేందుకు జేఎన్‌టీయూలోని ఆచార్యులే కాకుండా వృత్తి నిపుణులు, విశ్వవిద్యాలయాన్ని సందర్శించే ప్రముఖుల జాబితాను సిద్ధం చేశారు. ఆకస్మికంగా ఎవరైనా యూనివర్సిటీకి వస్తే వారు చెప్పే పాఠాలను రికార్డ్‌ చేసి సందర్భానుసారంగా విద్యార్థులకు ప్రసారం చేయనున్నారు.
 


మరింత సమాచారం... మీ కోసం!

‣ బాడీ లాంగ్వేజ్ ఎందుకు ముఖ్యం?

‣ దిద్దుబాటుతో విజయం తథ్యం!

‣ వాయుసేనలో విశిష్ట ఉద్యోగాలు

‣ 995 ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ కొలువులు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 08-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.