• facebook
  • whatsapp
  • telegram

Anganwadi Posts: తెలంగాణలో 8,815 అంగన్‌వాడీ పోస్టులు ఖాళీ

లోక్‌సభలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ
ఈనాడు, దిల్లీ: తెలంగాణలో 8,815 అంగన్‌వాడీ పోస్టులు(Anganwadi Vacancy) ఖాళీగా ఉన్నాయని కేంద్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. డిసెంబ‌రు 8న‌ లోక్‌సభలో ఓ ప్రశ్నకు ఆమె ఈ సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో 1,777 అంగన్‌వాడీ వర్కర్స్‌, 7,038 హెల్పర్‌ పోస్టులు(Anganwadi jobs) ఖాళీగా ఉన్నట్లు వివరించారు. విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో మనుషులను తరలించే నకిలీ ఏజెంట్లు తెలంగాణలో 113 మంది, ఏపీలో 471 మంది ఉన్నారని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్‌ తెలిపారు. డిసెంబ‌రు 8న‌ లోక్‌సభలో తెదేపా ఎంపీ గల్లా జయదేవ్‌ అడిగిన ఓ ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. గత అక్టోబర్‌ 30 నాటికి దేశవ్యాప్తంగా 2,925 మంది నకిలీ ఏజెంట్లను గుర్తించి ఈ-మైగ్రేట్‌ పోర్టల్‌లో వారి పేర్లను వెల్లడించినట్లు చెప్పారు.

మరింత సమాచారం... మీ కోసం!

‣ చెన్నై మెట్రోలో జీఎం, జేపీఎం ఖాళీలు 

‣ ఐఐఎమ్‌కేలో అకడమిక్‌ అసోసియేట్‌ పోస్టులు

రైట్స్‌ లిమిటెడ్‌లో ఇంజినీర్ పోస్టులు 

నార్త్‌ ఈస్ట్రన్‌ రైల్వేలో 1,104 యాక్ట్ అప్రెంటిస్ ఖాళీలు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 09-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.