• facebook
  • whatsapp
  • telegram

TS Gvt Jobs: ఉద్యోగాల భర్తీ ప్రక్రియ తాజా స్థితి ఏమిటి?

నియామక సంస్థల అధికారులను అడిగిన రాష్ట్ర ప్రభుత్వం
ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై ప్రభుత్వం ఆరా తీసింది. గత సర్కారు హయాంలో జారీ చేసిన నోటిఫికేషన్లు, వాటి తాజా వివరాలు తెలుసుకుంది. పరీక్షలు ఎంతవరకు పూర్తయ్యాయి? అయితే ఫలితాలు ఎప్పటిలోగా ఇస్తారు? వాటికి అడ్డంకులు ఏమిటి? తదితర వివరాలను తెలుసుకుంటోంది. టీఎస్‌పీఎస్సీ, గురుకుల నియామకబోర్డు, పాఠశాల విద్యాశాఖ, వైద్య నియామకబోర్డు ఉన్నతాధికారులతో సమావేశమైంది. ఈ సందర్భంగా నోటిఫికేషన్ల వివరాలు, తాజా స్థితి నివేదికలు వారు ఇచ్చారు. వీటిని పరిశీలించిన ప్రభుత్వం నియామక ప్రక్రియ వేగంగా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపింది. అదే విధంగా కొత్త ఉద్యోగాల భర్తీకి ప్రతిపాదనలు అందిస్తే, నోటిఫికేషన్లు జారీ చేసి, నియామక ప్రక్రియను వేగంగా పూర్తిచేసేందుకు కార్యాచరణ ఉందా? అని ప్రభుత్వం అడిగింది.  నోటిఫికేషన్‌ జారీకి, పరీక్షకు మధ్య ఎన్ని నెలల సమయం అవసరం? ఉద్యోగార్థులకు సన్నద్ధత కోసం ఎంత సమయం ఇవ్వాలి? నియామక ప్రక్రియ సజావుగా జరిగేందుకు తీసుకోవాల్సిన చర్యలు, సర్వీసు నిబంధనల్లో మార్పులు చేయాల్సిన అంశాలపై ఆరా తీసింది. మరోవైపు 2 లక్షల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వ విభాగాల వారీగా ఖాళీల వివరాలను ఆర్థికశాఖ సమీకరిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వ విభాగాలకు లేఖలు రాసింది. ప్రభుత్వ విభాగాల్లో ఏ స్థాయి ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి? రెండేళ్లలో పదవీ విరమణ తరువాత ఖాళీ అయ్యే ఉద్యోగాలెన్ని? తదితర వివరాలపై సమీక్ష జరుపుతోంది.

మరింత సమాచారం... మీ కోసం!

‣ చెన్నై మెట్రోలో జీఎం, జేపీఎం ఖాళీలు 

‣ ఐఐఎమ్‌కేలో అకడమిక్‌ అసోసియేట్‌ పోస్టులు

రైట్స్‌ లిమిటెడ్‌లో ఇంజినీర్ పోస్టులు 

నార్త్‌ ఈస్ట్రన్‌ రైల్వేలో 1,104 యాక్ట్ అప్రెంటిస్ ఖాళీలు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 09-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.