• facebook
  • whatsapp
  • telegram

Exam Schedule: ఎన్నికల నేపథ్యంలో మార్చిలోపు పరీక్షలు పూర్తి

* ఇంటర్‌ మార్చి 1.. పదో తరగతి 18 నుంచి పరీక్షలు  

* ఇంటర్‌కు 10లక్షలు, పది పరీక్షలకు 6 లక్షలమంది విద్యార్థుల హాజరు

* షెడ్యూలు విడుదల చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ
 


ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షలను మార్చి ఒకటి నుంచి 30 వరకు నిర్వహించనున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. విజయవాడలో గురువారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో పరీక్షల షెడ్యూలును ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు ఉన్నందున విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా మార్చి 31లోపు పరీక్షలు పూర్తిచేసేలా ప్రణాళిక రూపొందించామని, సీబీఎస్‌ఈ, ఇతర రాష్ట్రాల ఎన్నికల షెడ్యూలు పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ఈ ఏడాది పదోతరగతి పరీక్షలకు 6.23 లక్షలు, ఇంటర్మీడియట్‌ మొదటి ఏడాది 5,29,457, రెండో సంవత్సరం పరీక్షలకు 4,76,198 మంది హాజరుకానున్నారు. ఇంటర్‌ పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు, పదోతరగతి పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు కొనసాగుతాయి. ఎథిక్స్, మానవ విలువల పరీక్ష ఫిబ్రవరి 2, పర్యావరణ విద్య పరీక్ష 3న నిర్వహించనున్నారు. ప్రాక్టికల్‌ పరీక్షలు ఫిబ్రవరి 11 నుంచి 20, వృత్తివిద్య వారికి 5 నుంచి 20వరకు రెండు విడతలుగా ఉంటాయి. సమగ్ర శిక్ష అభియాన్‌ ఒకేషన్‌ ట్రేడ్‌ థియరీ పరీక్షలు ఫిబ్రవరి 22 నుంచి నిర్వహించనున్నారు.


 

ఇంటర్మీడియట్‌ పరీక్షలు ఇలా..

 

తేదీ ప్రథమ సంవత్సరం ద్వితీయ సంవత్సరం

మార్చి 1, 2
 
రెండో భాష-1  రెండో భాష-2

మార్చి 4, 5 
 
ఆంగ్లం-1  ఆంగ్లం-2

మార్చి 6, 7
 
గణితం-1ఏ  గణితం-2ఏ
వృక్షశాస్త్రం-1  వృక్షశాస్త్రం-2
సివిక్స్‌-1  సివిక్స్‌-2

మార్చి 9, 11 
 
గణితం-1బీ  గణితం-2బీ
జంతుశాస్త్రం-1  జంతుశాస్త్రం-2
చరిత్ర-1  చరిత్ర-2

మార్చి 12, 13
 
 
భౌతికశాస్త్రం-1  భౌతికశాస్త్రం-2
ఆర్థిక శాస్త్రం-1  ఆర్థిక శాస్త్రం-2
 

మార్చి 14, 15 
రసాయనశాస్త్రం-1  రసాయనశాస్త్రం-2
కామర్స్‌-1  కామర్స్‌-2
సోషియాలజీ-1  సోషియాలజీ-2
ఫైన్‌ఆర్ట్స్, మ్యూజిక్‌-1  ఫైన్‌ఆర్ట్స్, మ్యూజిక్‌-2


మార్చి 16, 18
 
పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌-1  పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌-2
లాజిక్‌-1  లాజిక్‌-2
బ్రిడ్జికోర్సు గణితం-1  బ్రిడ్జికోర్సు గణితం-2

మార్చి 19, 20 
 
మోడ్రన్‌ లాంగ్వేజ్‌-1  మోడ్రన్‌ లాంగ్వేజ్‌-2
జాగ్రఫీ-1  జాగ్రఫీ-2

పదోతరగతి పరీక్షల షెడ్యూలు

 

తేదీ సబ్జెక్టు
మార్చి 18  మొదటి భాష కాంపొజిట్‌ మొదటి భాష-1
మార్చి 19  రెండోభాష 
మార్చి 20  ఆంగ్లం
మార్చి 22  గణితం
మార్చి 23  భౌతిక, రసాయనశాస్త్రం
మార్చి 26  జీవశాస్త్రం
మార్చి 27  సాంఘిక శాస్త్రం
మార్చి 28  కాంపొజిట్‌ భాష-2, సంస్కృతం, అరబిక్, పార్శీ-1
మార్చి 30 సంస్కృతం, అరబిక్, పార్శీ-2, వృత్తి విద్య కోర్సు థియరీ


 

పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌...
మార్చి 18న ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-1
మార్చి 19న సెకండ్‌ లాంగ్వేజ్‌ 
మార్చి 20న ఇంగ్లిష్‌
మార్చి 22న మ్యాథ్స్‌
మార్చి 23న ఫిజికల్‌ సైన్స్‌
మార్చి 26న బయాలజీ
మార్చి 27న సోషల్‌ స్టడీస్‌
మార్చి 28న ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-2
మార్చి 30న లాంగ్వేజ్‌ పేపర్‌-2, ఒకేషనల్‌ కోర్సు థియరీ



 

  ఆంధ్రప్రదేశ్ పదో తరగతి స్టడీ మెటీరియల్  


 

తెలుగు TM EM
హిందీ TM EM
ఇంగ్లిష్ TM EM
గణిత శాస్త్రం TM EM
జీవశాస్త్రం TM EM
సాంఘిక శాస్త్రం TM EM
భౌతిక రసాయన శాస్త్రం TM EM
     
‣ మోడ‌ల్‌ పేప‌ర్లు TM EM
‣ ప్రీవియ‌స్ పేప‌ర్లు    TM EM


 

   ఆంధ్రప్రదేశ్  ఇంటర్మీడియట్  స్టడీమెటీరియల్  

జూనియ‌ర్ ఇంట‌ర్‌

గణితశాస్త్రం 1A

గణితశాస్త్రం 1B

రసాయన శాస్త్రం

భౌతికశాస్త్రం

జంతుశాస్త్రం


సీనియ‌ర్ ఇంట‌ర్‌


ఇంగ్లిష్

 భౌతికశాస్త్రం

జంతుశాస్త్రం

గణితశాస్త్రం 2A

గణితశాస్త్రం 2B

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 14-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.