• facebook
  • whatsapp
  • telegram

Nurse Exam Results: స్టాఫ్‌ నర్సు పరీక్ష ఫలితాల వెల్లడి

* మొత్తం 7,094 పోస్టులు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖలో స్టాఫ్‌ నర్సు పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ మేరకు పరీక్షకు హాజరైన అభ్యర్థుల మార్కులను వైద్య ఆరోగ్య సేవల రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) విడుదల చేసినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ డిసెంబరు 18న ఒక ప్రకటనలో తెలిపారు. వైద్య, ఆరోగ్య శాఖలో 7,094 స్టాఫ్‌ నర్సు పోస్టుల భర్తీకి గతేడాది డిసెంబరు 30న ప్రకటన వెలువడగా గత ఆగస్టులో రాతపరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 40,936 మంది అభ్యర్థులు హాజరయ్యారు. తమ మార్కులపై అభ్యంతరాలుంటే అభ్యర్థులు డిసెంబరు 20వ తేదీ సాయంత్రం 5.30 గంటలలోపు తెలియజేయాలని మంత్రి సూచించారు. అభ్యంతరాల అనంతరం అభ్యర్థుల మెరిట్‌ జాబితా విడుదల చేస్తామన్నారు. ప్రభుత్వ వైద్య సేవలో అనుభవం ఉన్నవారికి ప్రత్యేక పాయింటు కేటాయించారు. మార్కులతో పాటు రిజర్వేషన్ల వివరాలను అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్‌లో అందుబాటులో ఉంచారు.  ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 40,936 మంది అభ్యర్థులు హాజరయ్యారు. తమ మార్కులపై అభ్యంతరాలుంటే అభ్యర్థులు డిసెంబరు 20వ తేదీ సాయంత్రం 5.30 గంటలలోపు తెలియజేయాలని మంత్రి సూచించారు. అభ్యంతరాల అనంతరం అభ్యర్థుల మెరిట్‌ జాబితా విడుదల చేస్తామన్నారు. ప్రభుత్వ వైద్య సేవలో అనుభవం ఉన్నవారికి ప్రత్యేక పాయింట్లు కేటాయించారు. మార్కులతో పాటు రిజర్వేషన్ల వివరాలను అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్‌లో అందుబాటులో ఉంచారు.

* హెచ్‌ఎంఏ ఆన్‌లైన్‌ కోర్సు ప్రారంభం

ఎంబీఏ, బీబీఏ కోర్సులు పూర్తి చేసిన ఏపీ, తెలంగాణ విద్యార్థులను ఉద్యోగాలకు సిద్ధం చేసేందుకు రెండు నెలల ఆన్‌లైన్‌ సర్టిఫికెట్‌ కోర్సు ప్రారంభించినట్లు హైదరాబాద్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌(హెచ్‌ఎంఏ) తెలిపింది. ఈ కోర్సు ద్వారా పరిశ్రమలు కోరుకుంటున్న సాఫ్ట్‌ స్కిల్స్‌ నేర్పుతామని హెచ్‌ఎంఏ అధ్యక్షుడు జైవంత్‌ నాయుడు పేర్కొన్నారు.


   వెబ్‌సైట్‌   


 


మరింత సమాచారం... మీ కోసం!

‣ సివిల్స్‌ మౌఖిక పరీక్షకు మౌలిక సూచనలు

‣ ఫర్నిచర్‌ డిజైన్‌ కెరియర్‌ గైడెన్స్‌

‣ ఐటీఐతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం

‣ గ్రూప్ 1, 2 సక్సెస్‌కు ముఖ్య సూచనలు

‣ సన్నద్ధతకు ముఖ్య సూచనలు!

‣ ఫ్యాషన్‌ కెరియర్‌లో ప్రవేశాలు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 19-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.