• facebook
  • whatsapp
  • telegram

Sainik : సైనిక పాఠశాల కల సాకారమయ్యేనా?!

* ఈ స్కూల్‌ లేని రాష్ట్రాలు తెలంగాణ సహా నాలుగే

* కొత్త విధానంలో 100 ఏర్పాటుకు కేంద్రం నిర్ణయం

* ఒకటి మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ విన్నపం


ఈనాడు, హైదరాబాద్‌: సైనిక పాఠశాల.. తెలంగాణలో ఓ కలగానే మిగిలిపోయింది. దేశవ్యాప్తంగా 33 సైనిక్‌ స్కూళ్లు నడుస్తున్నాయి. ఈ పాఠశాల లేని నాలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. మిగతావి సిక్కిం, మేఘాలయ, త్రిపుర మాత్రమే. పొరుగున్న ఉన్న ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్రల్లో రెండేసి ఉన్నాయి. వాస్తవానికి తెలంగాణకు ఈ పాఠశాలను కేంద్ర ప్రభుత్వం ఎనిమిదేళ్ల క్రితమే మంజూరు చేసింది. రాష్ట్రానికి సైనిక్‌ స్కూల్‌ మంజూరయ్యేలా 2016లో అప్పటి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చొరవ తీసుకున్నారు. 2017లో సైనిక్‌ స్కూల్‌ సొసైటీతో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూ కూడా కుదుర్చుకుంది. వరంగల్‌ జిల్లా ధర్మసాగర్‌ మండలంలోని ఎలుకుర్తిలో పాఠశాల ఏర్పాటుకు 50 ఎకరాల స్థలం సేకరించినా ఆ తర్వాత అడుగు ముందుకు పడలేదు.

సైనిక్‌ పాఠశాలల ఏర్పాటుకు కేంద్రం 2022లో కొత్త విధానం తీసుకొచ్చింది. దీని ప్రకారం స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేట్‌, ప్రభుత్వ పాఠశాలలు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. తొలుత 100 బడులు ఏర్పాటు చేయాలని కేంద్రం సంకల్పించింది. డే స్కాలర్స్‌ విధానంలో 6 ఎకరాలు, హాస్టల్‌తో సహా అయితే 8 ఎకరాల స్థలం ఉండాలి. కేంద్రం రెండు విడతల్లో 35 పాఠశాలలు మంజూరు చేసింది. అయితే రాష్ట్రానికి ఒక్కటీ దక్కలేదు. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి రక్షణ శాఖ మంత్రిని కలిసి రాష్ట్రానికి పాఠశాల మంజూరు చేయాలని కోరారు. కొత్త విధానంలో పాఠశాల ఏర్పాటుకు ప్రభుత్వం ఆసక్తిగా ఉందని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో లేదా చుట్టుపక్కల దాన్ని నెలకొల్పేందుకు అవకాశం ఉందని చెబుతున్నారు.

ప్రయోజనాలివీ..

సైనిక్‌ పాఠశాలల్లో 6 నుంచి 12వ తరగతి వరకు సీబీఎస్‌ఈ సిలబస్‌తో ఆంగ్ల మాధ్యమంలో బోధిస్తారు. వన్‌ స్కూల్‌- వన్‌ స్పోర్ట్స్‌ నినాదంతో ఏదైనా ఒక క్రీడలో విద్యార్థులకు శిక్షణ ఇస్తారు. తక్కువ ఫీజుతో నాణ్యమైన విద్య అందుతుంది. కొత్త విధానంలోని పాఠశాలల్లో చేరేవారికి మెరిట్‌ ఆధారంగా ఫీజులో 50 శాతం(గరిష్ఠంగా రూ.40 వేలు) కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది.
 

మరింత సమాచారం... మీ కోసం!

‣ భవిష్యత్తు.. ఈ 12 టెక్నాలజీలదే!

‣ రైల్వే కోర్సులు.. అపార అవకాశాలు

‣ విజయానికి నైపుణ్యాలే సోపానాలు!

‣ వండర్‌ కెరియర్‌.. విజువల్‌ అనలిటిక్స్‌

‣ ఇవి పాటిస్తే.. సర్కారు నౌకరీ!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 14-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.