* టీఎస్ఈఏపీ సెట్ లేదా టీఎస్ఈఏ సెట్గా మార్చాలని ప్రతిపాదిన
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మసీ ప్రవేశాల కోసం ఎంసెట్ పేరిట నిర్వహిస్తున్న ప్రవేశపరీక్ష పేరును మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. 2017 నుంచి ఎంసెట్లో మెడికల్ సీట్ల భర్తీని తొలగించి, ఎంబీబీఎస్, ఇతర వైద్యకోర్సులను నీట్ ద్వారా భర్తీ చేస్తోంది. అయినప్పటికీ ఎంసెట్ పేరులో మెడికల్ అనే పదం అలాగే కొనసాగుతోంది. దాన్ని తొలగించాలని ప్రభుత్వ స్థాయిలో చర్చ జరిగింది. మెడికల్ పేరును తొలగిస్తూ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఎంసెట్లో ఎం అక్షరాన్ని తొలగించి, టీఎస్ఈఏపీ సెట్ లేదా టీఎస్ఈఏ సెట్ అని మార్చాలని ప్రతిపాదించినట్లు తెలిసింది. ఇక్కడ పీ అంటే ఫార్మసీ అని అర్థం. బీఫార్మసీ సీట్లను ఎంసెట్ ద్వారానే భర్తీ చేస్తున్నందున పీ అక్షరాన్ని పొందుపరిచినట్లు సమాచారం. ఈ రెండు పేర్లపై త్వరలోనే ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుని ఉత్తర్వులు జారీ చేసే అవకాశముంది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ భవిష్యత్తు.. ఈ 12 టెక్నాలజీలదే!
‣ రైల్వే కోర్సులు.. అపార అవకాశాలు
‣ విజయానికి నైపుణ్యాలే సోపానాలు!
‣ వండర్ కెరియర్.. విజువల్ అనలిటిక్స్
‣ ఇవి పాటిస్తే.. సర్కారు నౌకరీ!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.