• facebook
  • whatsapp
  • telegram

Students: ఉన్నత విద్యాసంస్థల్లోకి 4.33 కోట్ల మంది విద్యార్థులు

* 44% మేర పెరిగిన ఎస్సీ ప్రవేశాలు

* 2021-22 సర్వేను విడుదల చేసిన కేంద్ర విద్యాశాఖ

ఈనాడు, దిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్నత విద్యాసంస్థల్లో 2021-22 విద్యాసంవత్సరంలో 4.33 కోట్ల మంది విద్యార్థులు చేరినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 4.58% వృద్ధి నమోదైనట్లు తెలిపింది. 2020-21లో 4.14 కోట్ల మంది విద్యార్థులు ఉన్నత విద్యలో చేరారని పేర్కొంది. జనవరి25న కేంద్ర విద్యాశాఖ.. ఉన్నత విద్యపై 2021-22కు సంబంధించి దేశవ్యాప్త సర్వేను విడుదల చేసింది.

* ఇందులో ముఖ్యాంశాలేంటంటే..

* 2014-15 నుంచి 2021-22 మధ్యకాలంలో మహిళా విద్యార్థుల సంఖ్య 1.57 కోట్ల నుంచి 2.2 కోట్లకు పెరిగింది. 32% వృద్ధి నమోదైంది.

* ఎస్సీ విద్యార్థుల ప్రవేశాలు 44%మేర పెరిగాయి. వీరి సంఖ్య 2014-15లో 46.07 లక్షలు ఉండగా, 2021-22 నాటికి 66.23 లక్షలకు చేరింది.

* మహిళా ఎస్సీ విద్యార్థుల సంఖ్య 21.02 లక్షల నుంచి 31.72 లక్షలకు పెరిగి 51% వృద్ధి నమోదైంది.

* ఎస్టీ విద్యార్థుల సంఖ్య 16.41 లక్షల నుంచి 27.1 లక్షలకు చేరింది. ఇందులో 65.2% పెరుగుదల నమోదైంది.

* ఎస్టీ మహిళా విద్యార్థుల సంఖ్య 7.47 లక్షల నుంచి 13.46 లక్షలకు పెరిగింది. 80% వృద్ధి కనిపించింది.

* ఓబీసీ విద్యార్థుల సంఖ్య 1.13 కోట్ల నుంచి 1.63 కోట్లకు చేరింది. 45% పెరుగుదల కనిపించింది.

* మహిళా ఓబీసీ విద్యార్థుల సంఖ్య 52.36 లక్షల నుంచి 78.19 లక్షలకు పెరిగింది. ఇందులో 49.3% వృద్ధి నమోదైంది.

* 2014-15 నుంచి 2021-22 మధ్యకాలంలో పీహెచ్‌డీ ప్రవేశాలు 1.17 లక్షల నుంచి 2.13 లక్షలకు (81.2%) పెరిగాయి. ఇందులో మహిళా విద్యార్థుల సంఖ్య 48 వేల నుంచి 99 వేలకు పెరిగింది.

* ఉన్నత విద్యలో మైనార్టీ మహిళా విద్యార్థుల సంఖ్య 10.7 లక్షల నుంచి 15.2 లక్షల(42.3%)కి చేరింది.

* 2014-15 తర్వాత దేశంలో 341 యూనివర్శిటీలు, ఆ స్థాయి విద్యాసంస్థలు ఏర్పాటయ్యాయి.

* మహిళా బోధనా సిబ్బంది సంఖ్య 5.69 లక్షల నుంచి 6.94 లక్షలకు చేరింది. ఇందులో 22% వృద్ధి నమోదైంది.

* 17 యూనివర్శిటీలు, వాటి పరిధిలోని 4,470      కాలేజీలు కేవలం మహిళలకే పరిమితమయ్యాయి.

* బోధనా సిబ్బంది సంఖ్య ఇప్పుడు 15.98 లక్షలకు చేరింది. ఇందులో 56.6% పురుషులు, 43.4%  మహిళలు ఉన్నారు.
 




 

మరింత సమాచారం... మీ కోసం!

‣ భవిష్యత్తు.. ఈ 12 టెక్నాలజీలదే!

‣ రైల్వే కోర్సులు.. అపార అవకాశాలు

‣ విజయానికి నైపుణ్యాలే సోపానాలు!

‣ వండర్‌ కెరియర్‌.. విజువల్‌ అనలిటిక్స్‌

‣ ఇవి పాటిస్తే.. సర్కారు నౌకరీ!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 26-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.