• facebook
  • whatsapp
  • telegram

AP DSC TET: నేడే టెట్‌, డీఎస్సీ నోటిఫికేషన్‌

* మొత్తం 6,100 ఖాళీల భర్తీ 
* కొత్తగా అప్రెంటిస్‌షిప్‌ విధానం

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో డీఎస్సీ, ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) ప్రకటనను సోమవారం (ఫిబ్రవరి 5న) విడుదల కానుంది. ఆ రోజు నుంచే దరఖాస్తు స్వీకరిస్తారు. డీఎస్సీలో 6,100 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల సంఖ్య పెంచాలని నిరుద్యోగులు డిమాండ్‌ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈసారి కొత్తగా 12ఏళ్ల క్రితం తొలగించిన అప్రెంటిస్‌షిప్‌ విధానాన్ని తీసుకురానున్నారు. డీఎస్సీలో ఎంపికైన ఉపాధ్యాయులు రెండేళ్లపాటు గౌరవవేతనానికి పని చేయాల్సి ఉంటుంది. అప్రెంటిస్‌షిప్‌ సమయంలో ఎవరైనా ఏపీ ఉద్యోగుల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ప్రభుత్వం భావిస్తే వారి అప్రెంటిస్‌షిప్‌ సమయాన్ని పెంచే అవకాశం ఉంటుంది. టెట్‌, డీఎస్సీలకు కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షల నిర్వహణకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ టీసీఎస్‌తో ఒప్పందం కుదుర్చుకోనుంది.

* డీఈడీ వారికే ఎస్జీటీ అర్హత

సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్జీటీ) పోస్టులకు పేపర్‌-1, స్కూల్‌ అసిస్టెంట్లకు పేపర్‌-2 విడివిడిగా టెట్‌ నిర్వహిస్తారు. ఎస్జీటీ పోస్టులకు డీఈడీ లేదా నాలుగేళ్ల బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ చదివిన వారు మాత్రమే అర్హులు. టెట్‌ రాసేందుకు ఓసీలకు ఇంటర్మీడియట్‌లో 50 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 45 శాతం మార్కులు ఉండాలి. స్కూల్‌ అసిస్టెంట్లకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులైన అభ్యర్థులకు డిగ్రీలో అర్హత మార్కులు 40 శాతంగా ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని ఈ ఒక్కసారికే అనుమతించింది. గత ప్రభుత్వంలో 2018లో చివరిసారిగా డీఎస్సీ నిర్వహించారు. మొత్తం 7,902 పోస్టులకు ప్రకటన ఇవ్వగా.. 6.08 లక్షల దరఖాస్తులు వచ్చాయి. గతంలో ఎస్జీటీ పోస్టులకు బీఈడీ చేసిన వారికి అర్హత కల్పించినందున ఈ పోస్టులకు డీఎస్సీ, టెట్‌ కలిపి 100 మార్కులకు నిర్వహించారు. టీజీటీ వారికి ఆంగ్ల భాషలో స్క్రీనింగ్‌ పరీక్ష నిర్వహించారు. ఈసారి టెట్‌, డీఎస్సీ విడివిడిగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. టెట్‌, డీఎస్సీ రెండింటికి దరఖాస్తుల స్వీకరణ పూర్తయ్యేనాటికి ఎన్నికల షెడ్యూల్‌ వచ్చే అవకాశం ఉంది.
 


  డీఎస్సీ ఆంధ్రప్రదేశ్   


  స్కూల్ అసిస్టెంట్  
 

తెలుగు (కంటెంట్)
హిందీ (కంటెంట్)
ఇంగ్లిష్ (కంటెంట్)
బయాలజీ (కంటెంట్)
ఫిజికల్ సైన్సెస్ (కంటెంట్)
సోషల్ స్టడీస్ (కంటెంట్)
విద్యా దృక్పథాలు (కంటెంట్)
 సైకాలజీ (కంటెంట్)


 

  తెలుగు పండిట్   
 

కంటెంట్
మెథడాలజీ


  సెకండరీ గ్రేడ్ టీచర్స్   
 

లాంగ్వేజ్ - I తెలుగు (కంటెంట్)
గణితం (మెథడాలజీ)
సోషల్ స్టడీస్ (కంటెంట్)
 సైన్స్ (కంటెంట్)
 విద్యా దృక్పథాలు
సైకాలజీ (కంటెంట్)

లాంగ్వేజ్ - II ఇంగ్లిష్ (కంటెంట్)

లాంగ్వేజ్ - I హిందీ (కంటెంట్)
 
 
 
 
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 05-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.