• facebook
  • whatsapp
  • telegram

APPSC: అటవీశాఖలో 689 పోస్టుల భర్తీకి అనుమతి

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ అటవీశాఖలో 689 పోస్టులను భర్తీచేసేందుకు ఏపీపీఎస్సీకి అనుమతి లభించింది. ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి చిరంజీవి చౌదరి ఈ మేరకు ఫిబ్రవరి 6న  ఉత్తర్వులు ఇచ్చారు. పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి. హోంశాఖలో ఖాళీగా ఉన్న 7 జిల్లా సైనిక సంక్షేమాధికారుల పోస్టులను భర్తీచేసేందుకు ఆర్థికశాఖ అనుమతి ఇచ్చింది. రక్షణశాఖ నుంచి పదవీవిరమణ చేసిన అధికారులతో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో 60% జీతం, ఇతర భత్యాలను కేంద్ర రక్షణశాఖ భరిస్తుంది.

అటవీశాఖలో భర్తీ చేయనున్న ఉద్యోగాలు 

అటవీ రేంజి అధికారులు  37
అటవీ సెక్షన్‌ అధికారులు 70
అటవీ బీట్‌ అధికారులు  175
సహాయ బీట్‌ అధికారులు 375
తనహదార్‌ 10
డ్రాఫ్ట్స్‌మన్‌ గ్రేడ్‌ 2 12
జూనియర్‌ అసిస్టెంటు 10
మొత్తం  689



మరింత సమాచారం... మీ కోసం!

‣ సముద్రమంత ఉద్యోగావకాశాలు!

‣ ఐటీ రంగంలో అవరోధాలు అధిగమిద్దాం!

‣ ఎంఫిల్‌.. పీహెచ్‌డీ- ఏమిటి తేడా?

‣ ‘డేటా సైన్స్‌’తో డోకా లేదు!

‣ ఉపాధికి దిక్సూచి.. బిజినెస్‌ అనలిటిక్స్‌

‣ విదేశీ విద్య.. అవగాహన ముఖ్యం!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 07-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.