* అభ్యంతరాలకు గడువు ఫిబ్రవరి 10
ఈనాడు ప్రతిభ డెస్క్: సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) జనవరి-2024 కీని సీబీఎస్ఈ విడుదల చేసింది. పరీక్ష రాసిన అభ్యర్థులు అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలతో కీని డౌన్లోడ్ చేసుకోవచ్చు. కీపై అభ్యంతరాలను ఫిబ్రవరి 10వ తేదీలోగా తెలియజేయవచ్చు. దేశవ్యాప్తంగా జనవరి 21న పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. సీటెట్ పరీక్ష ఏటా రెండుసార్లు జరుగుతుంది. పరీక్ష మొత్తం రెండు పేపర్లను కలిగి ఉంటుంది. మొదటి పేపర్ ఒకటి నుంచి ఐదు తరగతులకు బోధించాలనుకునే వారికి కోసం, రెండో పేపర్ ఆరు నుంచి తొమ్మిదో తరగతులకు బోధించాలనుకునే వారి కోసం నిర్వహిస్తారు. సీటెట్ స్కోర్ లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. సీటెట్ స్కోర్ కేంద్ర ప్రభుత్వం పరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయ నియామకాల్లో పరిగణనలోకి తీసుకుంటారు.
సీటెట్ 2024 కీ కోసం క్లిక్ చేయండి
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.