• facebook
  • whatsapp
  • telegram

UPSC ESE 2024: యూపీఎస్సీ ఈఎస్‌ఈ 2024 ప్రిలిమ్స్‌ అడ్మిట్‌ కార్డులు

* డైరెక్ట్‌ డౌన్‌లోడ్ లింక్‌ ఇదే..

* ఫిబ్రవరి 18న పరీక్ష

ఈనాడు ప్రతిభ డెస్క్‌: ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌(ఈఎస్‌ఈ)-2024 ప్రాథమిక పరీక్ష ఈ-అడ్మిట్‌ కార్డులను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) విడుదల చేసింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు రిజిస్ట్రేషన్‌ ఐడీ, పుట్టిన తేదీ వివరాలతో  అడ్మిట్‌ కార్డు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఫిబ్రవరి 18న పరీక్ష జరుగనుంది. ఈ ప్రకటన ద్వారా యూపీఎస్సీ దేశవ్యాప్తంగా రైల్వే, టెలికాం, డిఫెన్స్‌ సర్వీస్‌ తదితర కేంద్ర ప్రభుత్వ విభాగాలు, శాఖల్లో ఇంజినీరింగ్‌ ఉద్యోగాలు భర్తీ చేయనుంది. సివిల్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలీకమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ విభాగాల్లో మొత్తం 167 పోస్టులు భర్తీ కానున్నాయి. స్టేజ్‌-1(ప్రిలిమినరీ) ఎగ్జామ్‌, స్టేజ్‌-2(మెయిన్‌) ఎగ్జామ్‌, స్టేజ్‌-3(పర్సనాలిటీ టెస్ట్‌), మెడికల్‌ ఎగ్జామినేషన్‌, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లో ప్రిలిమినరీ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.



యూపీఎస్సీ ఈఎస్‌ఈ 2024 ప్రిలిమ్స్‌ అడ్మిట్‌ కార్డుల కోసం క్లిక్‌ చేయండి

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 09-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.