• facebook
  • whatsapp
  • telegram

UPSC Civils Interview: సివిల్స్‌ ఇంటర్వ్యూ తేదీల వెల్లడి

* ఎంపికైన అభ్యర్థులు వీరే..
* త్వరలో అందుబాటులో కాల్‌ లెటర్లు

ఈనాడు ప్రతిభ డెస్క్‌: యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ఆధ్వర్యంలో నిర్వహించిన సివిల్ సర్వీసెస్ 2023 ఫేజ్‌-3 ఇంటర్వ్యూ తేదీలను యూపీఎస్సీ వెల్లడించింది. ఫేజ్‌-1లో ఎంపికైన అభ్యర్థులకు జనవరి 2 నుంచి ఫిబ్రవరి 16 వరకు ఇంటర్వ్యూ జరిగాయి. ఫేజ్‌-2లో ఎంపికైన వారికి ఫిబ్రవరి 19 నుంచి మార్చి 15 వరకు.. ఫేజ్‌-3లో ఎంపికైన వారికి మార్చి 18 నుంచి ఏప్రిల్‌ 9 వరకు ముఖాముఖి పరీక్షలు నిర్వహించనున్నారు. అభ్యర్థుల రోల్‌ నంబర్‌, ఇంటర్వ్యూ తేదీ, సమయం వివరాలను యూపీఎస్సీ ప్రకటించింది. త్వరలోనే ఇ-సమన్‌ లెటర్లు వెబ్‌సైట్‌లో పొందుపరచనున్నట్లు కమిషన్‌ పేర్కొంది. సెప్టెంబ‌ర్ 15వ తేదీ నుంచి 24వ తేదీ వ‌ర‌కు సివిల్స్‌ ప్రధాన పరీక్షలు జరగ్గా..  డిసెంబర్‌ 8న ఫలితాలు విడుదలయ్యాయి. మెయిన్స్‌లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఇంటర్వ్యూ(పర్సనాలిటీ టెస్ట్‌)కు హాజరు కావాల్సి ఉంటుంది. రాత పరీక్ష(ప్రిలిమ్స్, మెయిన్స్), ఇంటర్వ్యూ, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

సివిల్స్‌ ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థులు, తేదీల వివరాలు

ఫేజ్‌-1 జాబితా
 

ఫేజ్‌-2 జాబితా
 

ఫేజ్‌-3 జాబితా
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 16-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.