• facebook
  • whatsapp
  • telegram

JEE Main: జేఈఈ మెయిన్‌లో గణితానిదే నిర్ణయాత్మకపాత్ర

* ఐఐటీ కోచింగ్‌ నిపుణుడు ఉమాశంకర్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి: దేశవ్యాప్తంగా ఏప్రిల్‌ 4న  జరిగిన జేఈఈ మెయిన్‌ రెండోవిడత పరీక్షలో గణితం నుంచి ప్రశ్నలు కఠినంగా వచ్చాయని శ్రీచైతన్య కళాశాలల అఖిల భారత ఐఐటీ సమన్వయకర్త ఉమాశంకర్‌ తెలిపారు. ‘భౌతికశాస్త్రంలో కాస్త ఫర్వాలేదనిపించినా.. రసాయనశాస్త్రం నుంచి ప్రశ్నలు మధ్యస్థంగా వచ్చాయి. గణితం ప్రశ్నలు చాలా సుదీర్ఘంగా ఉండటంతో ఎక్కువ సమయం వెచ్చించాల్సి వచ్చింది. ఆ ప్రభావం భౌతిక, రసాయన శాస్త్రాలపై పడింది. ఆ రెండింటినీ త్వరగా చేసి మిగతా సమయాన్ని గణితంపై వెచ్చించిన వారు ర్యాంకుల్లో ముందు వరుసలో ఉంటారు’ అని ఉమాశంకర్‌ వెల్లడించారు. రెండు షిఫ్టుల్లోనూ గణితం నిర్ణయాత్మక పాత్ర పోషించనుందని అభిప్రాయపడ్డారు. గణితంలో ఎక్కువగా కలనగణితం, సంభావ్యత నుంచి.. రసాయన శాస్త్రంలో కర్బన రసాయనశాస్త్రం నుంచి వచ్చాయి. భౌతికశాస్త్రంలో యంత్రగతిశాస్త్రం, విద్యుచ్ఛక్తి, అయస్కాంత క్షేత్రం నుంచి ఎక్కువగా ప్రశ్నలు అడిగారని శారదా విద్యాసంస్థల ఐఐటీ నిపుణుడు జి.విఘ్నేశ్వరరావు వెల్లడించారు.




  DOWNLOAD JEE MAIN – 2024 ADMIT CARDS  


  JEE Main 2024 Official website  



Click for JEE Main 2024 Session-2 City Intimation Slips


JEE Main Study Material


Physics


Chemistry


Mathematics


  Download JEE Model Papers 2024  

****************************************************

మరింత సమాచారం... మీ కోసం!

‣ సోషల్‌ మీడియా ఖాతాల ముఖ్యపాత్ర

‣ మార్కెట్‌ మందగమనంలో ఉద్యోగ సాధన!

‣ మ‌లిద‌శ ప‌రీక్ష‌లో గెలుపు వ్యూహం!

‣ మూడు నెల‌ల్లో గేట్ మొద‌టి ర్యాంకు

‣ ప్రసిద్ధ సంస్థల్లో బీబీఏ, ఎంబీఏ కోర్సులు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 05-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.