• facebook
  • whatsapp
  • telegram

JEE Main 2024 Results: జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల ప్రతిభ 

22 మందికి 100 పర్సంటైల్ 



JEE Main 2024 (Session 2) Result: జేఈఈ మెయిన్‌ 2024 (సెషన్‌-2) ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు మరోసారి జాతీయ స్థాయిలో సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మంది 100 పర్సంటైల్‌ స్కోరు సాధించగా.. వీరిలో 22 మంది తెలుగు విద్యార్థులే ఉండటం విశేషం. ఈ ఘనతను సాధించిన వారిలో తెలంగాణ నుంచి 15 మంది, ఏపీ నుంచి ఏడుగురు విద్యార్థులు ఉన్నారు. ఏప్రిల్‌ 22న జేఈఈ మెయిన్ తుది కీ విడుదల చేసిన నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ కన్నా ఒకరోజు ముందే రిజల్ట్స్‌ను వెబ్ సైటులో అందుబాటులో ఉంచింది. విద్యార్థులు తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి స్కోర్ కార్డులను పొందొచ్చు. 
 

   స్కోర్ కార్డు కోసం క్లిక్ చేయండి    

 

సెషన్ -1లో  23 మందికే 100 పర్సంటైల్!

జనవరిలో జరిగిన జేఈఈ మెయిన్‌ సెషన్‌- 1 పరీక్షకు 12,21,624 మంది రిజిస్ట్రేషన్‌ చేసుకోగా.. 23 మంది విద్యార్థులు 100 పర్సంటైల్‌ సాధించి సత్తా చాటిన విషయం తెలిసిందే. ఏప్రిల్‌ 4 నుంచి 12వరకు జరిగిన JEE Main సెషన్‌ -2 పరీక్షకు 12.57లక్షల మంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. మొత్తంగా రెండు సెషన్లకు హాజరైన విద్యార్థులు సాధించిన మెరుగైన స్కోరును పరిగణనలోకి తీసుకొని ఎన్టీఏ (NTA) మెరిట్‌ లిస్ట్‌ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 2.5 లక్షల మందిని అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక చేసింది. కేటగిరీల వారీగా కటాఫ్‌ను సైతం ప్రకటించింది. రాష్ట్రాల వారీగా టాపర్స్ వివరాలను ప్రకటించింది.

100 పర్సంటైల్‌ సాధించిన విద్యార్థులు..

1) హందేకర్‌ విదిత్‌ (తెలంగాణ), 2 ముత్తవరపు అనూప్‌ (తెలంగాణ),  3 వెంకటసాయి తేజ మదినేని (తెలంగాణ),  4 రెడ్డి అనిల్‌ (తెలంగాణ),  5 రోహన్‌సాయి పబ్బ (తెలంగాణ), 6 శ్రీయాశస్‌ మోహన్‌ కల్లూరి (తెలంగాణ), 7 కేసం చెన్నబసవరెడ్డి (తెలంగాణ), 8 మురికినటి సాయి దివ్యతేజరెడ్డి (తెలంగాణ), 9 రిషి శేఖర్‌ శుక్లా(తెలంగాణ), 10 తవ్వ దినేశ్‌రెడ్డి (తెలంగాణ),  11 గంగ శ్రేయాస్‌ (తెలంగాణ), 12 పొలిశెట్టి రితీశ్‌ బాలాజీ (తెలంగాణ), 13 తమటం జయదేవ్‌రెడ్డి (తెలంగాణ), 14 మరువు జస్విత్‌ (తెలంగాణ), 15 దొరిసాల శ్రీనివాస్‌రెడ్డి (తెలంగాణ), 16 చింటు సతీశ్‌ కుమార్‌ (ఆంధ్రప్రదేశ్‌), 17 షేక్‌ సూరజ్‌ (ఆంధ్రప్రదేశ్‌), 18 తోటంశెట్టి నిఖిలేశ్‌ (ఆంధ్రప్రదేశ్‌), 19 తోట సాయికార్తిక్‌ (ఆంధ్రప్రదేశ్‌), 20 మురసని సాయి యశ్వంత్‌రెడ్డి (ఆంధ్రప్రదేశ్‌), 21 మాకినేని జిష్ణుసాయి (ఆంధ్రప్రదేశ్‌), 22 అన్నారెడ్డి వెంకట తనీష్‌రెడ్డి (ఆంధ్రప్రదేశ్‌)


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఈ ఏడు నైపుణ్యాలతో ఐటీ ప్రొఫెషనల్స్‌గా..!

‣ ఎన్నికల శాస్త్రాన్ని ఎంచుకుందామా!

‣ పరీక్ష యాంగ్జైటీ.. తగ్గేది ఇలా!

‣ కోచింగ్‌ లేదు... డెయిలీ టార్గెట్స్‌ పూర్తీచేశా!

Updated Date : 25-04-2024 11:40:09

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం