• facebook
  • whatsapp
  • telegram

TGPSC Group-1: గ్రూప్‌-1 పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు

* పరీక్ష 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 

కరీంనగర్‌ కలెక్టరేట్, న్యూస్‌టుడే : గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌కు పకడ్బందీ ఏర్పాట్లతోపాటు పరీక్ష కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి ఆదేశించారు. కరీంనగర్‌ కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్లో పరీక్ష ఏర్పాట్లపై అధికారులతో జిల్లా కలెక్టర్‌ అదనపు కలెక్టర్‌ ప్రఫుల్‌దేశాయ్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. కరీంనగర్‌లో 36 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో 34 ప్రైవేటు విద్యాసంస్థలు, రెండు ప్రభుత్వ విద్యాసంస్థలు ఉన్నాయన్నారు. జిల్లాలో 18,663 మంది పరీక్ష రాయనున్నారని తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్తు, ఫ్యాన్లు, లైట్లు, ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గట్టి నిఘా మధ్య పరీక్ష ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా చూడాలని తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పటిష్ఠ పోలీసు బందోబస్తు కల్పించాలని, అభ్యర్థులను తనిఖీ చేసిన తరువాత పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించాలన్నారు. బయోమెట్రిక్‌ హాజరు విధానం ఉంటుందని తెలిపారు. అభ్యర్థులు జూన్‌ 9న ఉదయం 9 గంటలకు ఆయా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. 10 గంటలకు పరీక్ష కేంద్రాల గేట్లు మూసివేస్తారని చెప్పారు. ఆ తర్వాత వచ్చే వారిని అనుమతించరన్నారు. పరీక్ష 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతుందని తెలిపారు. అభ్యర్థులు ఆయా కేంద్రాలకు సమయానికి చేరుకునేలా అధికారులు ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. ఎక్కడా ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అభ్యర్థులు ఒకసారి కేంద్రంలోకి వచ్చాక పరీక్ష సమయం పూర్తయ్యే వరకు బయటకు వెళ్లకుండా చూడాలని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా జరిగేలా కృషి చేయాలని పేర్కొన్నారు. సమావేశంలో డీఆర్వో పవన్‌కుమార్, ఆర్డీవో మహేశ్వర్, అదనపు డీసీపీ జె.కుమార్, కొండగట్టు జేఎన్‌టీయూ కళాశాల ప్రొఫెసర్‌ సతీష్‌కుమార్, కలెక్టరేట్‌ సూపరింటెండెంట్‌ కాళీచరణ్, మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ టి.శ్రీలక్ష్మి, ఇతర అధికారులు పాల్గొన్నారు.


  TSPSC Group-1 Notification  
 
  TSPSC Group -1 Prelims Model papers  


  TSPSC Group-1 previous papers  

  TSPSC Group -1 prelims study material  


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ పోటీ ప్రపంచంలో డేటా విశ్వరూపం!

‣ ప్రతికూల ఆలోచనలను ప్రతిఘటిద్దాం!

‣ టెక్స్‌టైల్‌ కమిటీలో ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ కొలువులు!

‣ ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ఫార్మసీ కోర్సులు!



 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 31-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.