* మే 12 వరకు నిర్వహణ
ఆంధ్రప్రదేశ్‌లో...
ఈనాడు, అమరావతి: జేఈఈ మెయిన్ కారణంగా ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల తేదీల్లో మార్పులు చేశారు. రాష్ట్ర విద్యాశాఖ మార్చి 3న కొత్త తేదీలను ప్రకటించింది. దీని ప్రకారం పరీక్షలు ఏప్రిల్ 22న మొదలై మే 12 వరకు జరుగనున్నాయి. ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఇంటర్మీడియట్ పరీక్షలు ఏప్రిల్ 8 నుంచి 28 వరకు జరగాల్సి ఉంది. జేఈఈ మెయిన్ పరీక్షలను ఏప్రిల్ 16 నుంచి 21 వరకు నిర్వహిస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రెండు రోజుల కిందట ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేసినట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు.
* ప్రాక్టికల్ పరీక్షలు యథావిధిగా...
మరోవైపు ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలను గతంలో ప్రకటించిన తేదీల్లోనే (మార్చి 11 నుంచి మార్చి 31) జరుగుతాయని మంత్రి సురేశ్ తెలిపారు. కొవిడ్ నిబంధనల మేరకే పరీక్షలు నిర్వహిస్తామన్నారు. దీనికి సంబంధించి బోర్డు తరపున అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. 1,400 పరీక్షా కేంద్రాలు, 900 ల్యాబ్‌లను సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. ఇన్విజిలేషన్‌కు సిబ్బంది సమస్య లేదని ఆయన చెప్పారు. పది, ఇంటర్ పరీక్షల నిర్వహణకు పరీక్షా కేంద్రాల ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బందులు లేవని తెలిపారు.
తెలంగాణలో...
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణలో నెల రోజుల క్రితం ప్రకటించినట్లు ఇంటర్ పరీక్షలు వచ్చే ఏప్రిల్ 20వ తేదీ నుంచి కాకుండా 22 నుంచి మొదలు కానున్నాయి. జేఈఈ మెయిన్ పరీక్షలు ఏప్రిల్ 16 నుంచి 21 వరకు నిర్వహిస్తామని జాతీయ పరీక్షల మండలి (ఎన్‌టీఏ) మార్చి 1న ప్రకటించిన నేపథ్యంలో ఇంటర్ పరీక్షలను రెండు రోజులు ఆలస్యంగా ప్రారంభిస్తూ బోర్డు కార్యదర్శి జలీల్ మార్చి 2న రాత్రి కాలపట్టికను వెల్లడించారు. దానివల్ల జేఈఈ మెయిన్ పరీక్షలు ఏప్రిల్ 21వ తేదీతో ముగియనుండగా... ఇంటర్ సెకండియర్ ఎంపీసీ విద్యార్థులకు ఇంటర్ ద్వితీయ భాష పరీక్ష 23న మొదలవుతుంది. అంటే వారు పరీక్షకు సిద్ధమయ్యేందుకు ఒక రోజు వ్యవధి దొరుకుతుంది. ప్రధాన గ్రూపులైన ఎంపీసీ, బైపీసీ పరీక్షలు ప్రథమ ఏడాది వారికి మే 6వ తేదీకి, ద్వితీయ ఇంటర్‌కు 7వ తేదీకి పూర్తవుతాయి. అన్ని సబ్జెక్టుల పరీక్షలు మే 12తో ముగుస్తాయి.
* యోగ, పర్యావరణం, మానవీయ విలువల పరీక్షలు యథాతథం
గతంలో ప్రకటించినట్లుగానే ప్రయోగ పరీక్షలు మార్చి 23 నుంచి ఏప్రిల్ 8 వరకు నిర్వహిస్తారు. మార్చి 11న ప్రథమ ఏడాది విద్యార్థులకు నైతికత, మానవీయ విలువలు, 12న పర్యావరణ విద్య పరీక్షలు నిర్వహిస్తామని బోర్డు కార్యదర్శి జలీల్ తెలిపారు. ఆ పరీక్షల్లో ఎటువంటి మార్పు ఉండదని ఆయన పేర్కొన్నారు.

మరింత సమాచారం ... మీ కోసం!
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ మోడల్ పేపర్లు
జూనియర్ ఇంటర్ | సీనియర్ ఇంటర్ |
‣ గణితశాస్త్రం 1A | ‣ రసాయన శాస్త్రం |
‣ గణితశాస్త్రం 1B | ‣ వృక్షశాస్త్రం |
‣ భౌతికశాస్త్రం | ‣ జంతుశాస్త్రం |
మరిన్ని Subjects కోసం... | |
‣ మోడల్ పేపర్లు | |
‣ ప్రీవియస్ పేపర్లు |
తెలంగాణ ఇంటర్మీడియట్ - 2022 ప్రభుత్వం విడుదల చేసిన మోడల్ పేపర్లు
జూనియర్ ఇంటర్ | సీనియర్ ఇంటర్ |
‣ గణితశాస్త్రం 1A | ‣ రసాయన శాస్త్రం |
‣ గణితశాస్త్రం 1B | ‣ వృక్షశాస్త్రం |
‣ భౌతికశాస్త్రం | ‣ జంతుశాస్త్రం |
మరిన్ని Subjects కోసం... | |
‣ మోడల్ పేపర్లు | |
‣ ప్రీవియస్ పేపర్లు |
‣ Read Latest job news, Career news, Education news and Telugu news
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.