• facebook
  • whatsapp
  • telegram

జేఈఈ మెయిన్ 2021 మార్గదర్శకాలు

తప్పనిసరిగా తీసుకెళ్లాల్సినవి

జేఈఈ మొదటి సెషన్ మెయిన్ ప‌రీక్ష‌ను ఈ ఏడాది ఫిబ్రవరి 23 నుంచి 26 వరకు నిర్వహించనున్నారు. అభ్యర్థులు సంబంధిత వెబ్‌సైట్ (jeemain.nta.nic.in) నుంచి మెయిన్ అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకునేందుకు నేషనల్‌టెస్టింగ్‌ఏజెన్సీ(ఎన్‌టీఏ) వీలు క‌ల్పించింది. ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 6.62 లక్షల మంది పోటీపడుతున్నారు. వారిలో తెలుగు రాష్ట్రాల నుంచే 1.61 లక్షల మందికిపైగా విద్యార్థులు ఉన్నారు. అందులో ఏపీ నుంచి 87,797 మంది, తెలంగాణ నుంచి 73,782 మంది ఉన్నారు. కొవిడ్ - 19 నేప‌థ్యంలో అభ్య‌ర్థుల ఆరోగ్యం, భ‌ద్ర‌త దృష్ట్యా ప‌రీక్ష కేంద్రాల నిర్వ‌హ‌ణ‌లో పాటించాల్సిన మార్గ‌ద‌ర్శ‌కాలను ఎన్‌టీఏ విడుద‌ల చేసింది.  విద్యార్థులు పరీక్ష కేంద్రాల్లోకి తెచ్చుకోవాల్సిన వస్తువులు, నిబంధనలను ప్రకటించింది.  ఆన్‌లైన్‌ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు మాస్కుతో పాటు చేతులకు గ్లౌజ్‌లు ధరించి రావొచ్చని ఎన్‌టీఏ వెల్లడించింది.  

అడ్మిట్ కార్డు త‌ప్ప‌నిస‌రి

ఏ4 సైజు పేపర్‌పై ముద్రించిన జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డు కాపీని త‌ప్ప‌నిస‌రిగా పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లాలి. అభ్యర్థులు అడ్మిట్ కార్డును అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

సెల్ఫ్ డిక్ల‌రేష‌న్‌ ఫాం

జేఈఈ మెయిన్ హాల్ టికెట్‌లో భాగంగా అభ్య‌ర్థులు సెల్ఫ్ డిక్ల‌రేష‌న్‌ఫాంను నింపాల్సి ఉంటుంది. పరీక్షా కేంద్రానికి చేరుకునే ముందే దీన్ని సిద్ధం చేసుకోవాలి. ప‌రీక్ష తేదీకి 14 రోజుల ముందు నుంచి దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బంది, గొంతు నొప్పి / ముక్కు కారటం వంటి లక్షణాలకు సంబంధించిన వివ‌రాలు అందులో తెల‌పాల్సి ఉంటుంది. 

పాస్‌పోర్ట్‌సైజ్ ఫొటో

హాల్‌టికెట్‌తోపాటు ఒక పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోను తప్పనిసరిగా తీసుకెళ్లాలి. స‌ద‌రు ఫొటో జేఈఈ ప్రధాన దరఖాస్తు ఫారమ్‌లో అప్‌లోడ్ చేసినట్లే ఉండాలి. ఈ ఫొటో పరీక్ష సమయంలో కేంద్రంలోని హాజరు షీట్‌లో అతికించడానికి ఉపయోగిస్తారు.

ప్ర‌భుత్వం ఆమోదించిన ఐడీకార్డు 

ప‌రీక్ష కేంద్రంలోకి ప్రభుత్వం ఆమోదించిన ఒరిజిన‌ల్‌ఫొటో ఐడీకార్డు(పాన్ కార్డు / డ్రైవింగ్ లైసెన్స్ / ఓటరు ఐడీ / పాస్‌పోర్ట్‌/ ఆధార్ కార్డు / రేషన్ కార్డు) తీసుకెళ్లాలి. 

పీడబ్ల్యూడీ సర్టిఫికేట్

పీడబ్ల్యూడీ కేట‌గిరీకి చెందిన అభ్యర్థులు సంబంధిత అధికారులు జారీ చేసిన ధ్రువీక‌ర‌ణ ప‌త్రాన్ని ప‌రీక్ష స‌మ‌యంలో చూపాల్సి ఉంటుంది.

* ప‌రీక్ష కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్స్‌ పరికరాలు, మొబైల్‌, ఎత్తు సోల్‌ ఉన్న బూట్లు, చెప్పులు అనుమ‌తించ‌కూడ‌ద‌ని తెలిపింది.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 17-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.