ఈనాడు, అమరావతి: ప్రైవేటు కళాశాలల్లో బీఎస్సీ, పోస్టు బేసిక్, బీపీటీ కోర్సులకు కొత్త ఫీజులను ఖరారు చేస్తూ వైద్యారోగ్యశాఖ జనవరి 12న ఉత్తర్వులు జారీ చేసింది. కన్వీనర్ కోటా ఫీజు రూ.18వేలు, యాజమాన్య కోటా రూ.80వేలుగా పేర్కొంది. ఎంఎస్సీ నర్సింగ్ కోర్సు ఫీజు కన్వీనరు కోటాలో రూ.83వేలు, యాజమాన్య కోటా ఫీజు రూ.1,49,000గా ఖరారు చేసింది. కొత్త ఫీజులు 2020-21 నుంచి 2022-23 విద్యాసంవత్సరం వరకు అమల్లో ఉంటాయని వెల్లడించింది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.