• facebook
  • twitter
  • whatsapp
  • telegram

చదువుకునే చోటు ఎలా ఉండాలి?

బాగా చదవాలంటే దానికి తగిన పరిసరాలు కూడా ఉండాలి. అప్పుడే ఎక్కువసేపు ఆ గదిలో   గడపగలుగుతాం. త్వరగా ఏకాగ్రత కోల్పోవడం, విసుగు రావడం వంటివి జరగకుండా ఉంటాయి. మరి అలాంటి చక్కని రీడింగ్‌ రూం కోసం ఏం చేయాలో తెలుసుకుందామా...

గది ఎలా ఉండాలి?

చదువుకునే గది ఎప్పుడూ ఇంటికి ఒక మూలగా, అంతగా శబ్దాలు లేని చోట ఏర్పాటు చేసుకోవాలి.

గదికి వేసే రంగులు లేతవే ఎంచుకోవాలి. లేత నీలం, ఆకుపచ్చ, పసుపు, నారింజ రంగులు ఆహ్లాదకరంగా ఉంటాయి.

వీలైనన్ని తక్కువ వస్తువులు గదిలో ఉండాలి. అప్పుడే ప్రశాంతంగా చదువుకునే వాతావరణం ఉంటుంది. 

కళ్లపై ఎక్కువ ఒత్తిడి పడకుండా సరైన వెలుతురు ఉండేలా చూసుకోవాలి.

టేబుల్‌ ఎలా ఉండాలి?

చిన్న గదులకైతే మూలన పెట్టేందుకు వీలుండే కార్నర్‌ టేబుల్స్‌ ఉత్తమం. వీటి వల్ల జాగా మిగిలి గది విశాలంగా ఉన్న భావన కలుగుతుంది. 

కాస్త పెద్ద గదులకైతే ఎల్, లేదా యు ఆకారపు టేబుల్స్‌ చక్కని ఎంపిక. 

కుర్చీ ఎత్తు 26 నుంచి 30 ఇంచుల వరకూ ఉంటే సౌకర్యంగా ఉంటుందనేది సాధారణ అంచనా. విద్యార్థి ఎత్తును బట్టి దీన్ని మార్చుకోవచ్చు.

పుస్తకాలన్నీ అక్కడే పట్టే వీలుండేలా స్టోరేజ్‌ టేబుల్స్‌ను ఎంచుకోవడం మంచిది.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఏకకాలంలో ప్రిపరేషన్‌ ఏంతో మేలు!

‣ ఎంసెట్‌ పై సందేహాలకు సమాధానాలు

‣ ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ ఇలా సాధించాడు!

‣ భారత విద్యార్థులకు బ్రిటిష్‌ కౌన్సిల్‌ స్కాలర్‌షిప్స్‌

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 06-04-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌