దేశ వ్యాప్తంగా ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో పీజీ, డాక్టోరల్ కోర్సుల్లో ప్రవేశానికి ఏటా నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్)-2023 నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది. జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ పరీక్ష స్కోరు ఉన్నత విద్యతో పాటు కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాల ఎంపికకు సైతం ఉపయోగపడుతుంది. ఐఐటీలు, నిట్ వంటి విద్యాసంస్థల్లో మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్డీ కోర్సులు చేయడానికి గేట్ స్కోర్ తప్పనిసరి. ఈ ఏడాది గేట్ పరీక్షను ఐఐటీ కాన్పూర్ నిర్వహిస్తోంది.
వివరాలు...
* గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్)-2023
అర్హతలు: ఇంజినీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, సైన్స్, కామర్స్, ఆర్ట్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితి లేదు.
పరీక్ష విధానం: అభ్యర్థులను కంప్యూటర్ ఆధారిత పరీక్షలో వచ్చిన స్కోర్ ఆధారంగా ఎంపిక చేస్తారు. పరీక్షకు 3 గంటల వ్యవధి ఉంటుంది. 29 సబ్జెక్టుల్లో నిర్వహిస్తారు. అభ్యర్థులు 1 లేదా 2 పేపర్లను ఎంపికచేసుకోవచ్చు. ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహించే ఈ పరీక్షలో మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు, మల్టిపుల్ సెలెక్ట్ ప్రశ్నలు, న్యూమరికల్ ఆన్సర్ టైప్ ప్రశ్నలు ఉంటాయి. 1, 2 మార్కుల ప్రశ్నలుంటాయి. నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.1700(జనరల్ అభ్యర్థులకు), రూ.850(మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు)
దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: అనంతపురం, కర్నూలు, ఏలూరు, కాకినాడ, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, చీరాల, చిత్తూరు, గూడూరు, గుంటూరు, నెల్లూరు, ఒంగోలు, తిరుపతి, హైదరాబాద్, కోదాడ, నిజామాబాద్, సూర్యాపేట, వరంగల్.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం: 30-08-2022.
ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: 30-09-2022.
అపరాధ రుసుముతో దరఖాస్తుకు చివరితేది: 07-10-2022.
పరీక్ష తేదీలు: 04-02-2023, 05-02-2023, 11-02-2023, 12-02-2023.
పరీక్ష ఫలితాల విడుదల: 16-03-2023.
మరింత సమాచారం ... మీ కోసం!
‣ అగ్రికల్చర్ బ్యాంకులో ఆఫీసర్ ఉద్యోగాలు
‣ డేటాసైన్స్ ఉద్యోగాలకు డిమాండ్!
VTU: విశ్వేశ్వరయ్య వర్సిటీలో పీహెచ్డీ ప్రోగ్రాం
NTRUHS: డా.ఎన్టీఆర్ వర్సిటీలో పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ కోర్సు
NTRUHS: డా.ఎన్టీఆర్ వర్సిటీలో బీఎస్సీ, బీపీటీ కోర్సులు
TS BC Welfare: తెలంగాణ బీసీ స్టడీ సర్కిళ్లలో గ్రూప్ పరీక్షలకు ఉచిత శిక్షణ
TSWREIS Admissions: సిరిసిల్ల సాంఘిక సంక్షేమ కళాశాలలో డిజైన్ & టెక్నాలజీ కోర్సు
OU Admissions: ఉస్మానియా వర్సిటీలో క్లినికల్ జెనెటిక్స్ సర్టిఫికేట్ కోర్సు
OU Admissions: ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్డీ ప్రవేశాలు
OU Courses: ఓయూ దూరవిద్యలో డిగ్రీ, పీజీ కోర్సులు
SAIL Jobs: సెయిల్, రూర్కెలాలో 200 ట్రైనీలు
MAT: మ్యాట్-2022 సెప్టెంబర్ సెషన్
NIFT: నిఫ్ట్‌లో డిప్లొమా కోర్సులు
JNV Admissions: నవోదయ విద్యాలయ సమితిలో ఇంటర్ ప్రవేశాలు
CAT 2022: కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్)-2022
APPSC- RIMC: ఏపీపీఎస్సీ- ఆర్ఐఎంసీలో ఎనిమిదో తరగతి ప్రవేశాలు
JNAFAU: జేఎన్ఏఎఫ్ఏయూలో ఎంఎఫ్ఏ కోర్సులు
ICAR AIEEA 2022: యూజీ, పీజీ, పీహెచ్డీ వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశాలు
TSPSC-RIMC: టీఎస్పీఎస్సీ-ఆర్ఐఎంసీలో ఎనిమిదో తరగతి ప్రవేశాలు
IISC Admissions: ఐఐఎస్సీలో బీటెక్ ప్రోగ్రాం
Manuu Admissions: మనూ, హైదరాబాద్‌లో వివిధ ప్రోగ్రాములు