• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఇగ్నోలో జులై సెష‌న్‌-2021‌ దూర‌విద్య‌ ప్ర‌వేశాలు 

న్యూదిల్లీలోని ఇందిరాగాంధీ నేష‌న‌ల్ ఓపెన్ యునివ‌ర్సిటీ(ఇగ్నో) జులై 2021 సెషన్‌కు గాను కింది ప్రోగ్రాముల్లో ప్ర‌వేశాల‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

* జులై సెష‌న్‌-2021‌ దూర‌విద్య కోర్సులు

ప్రోగ్రాములు: 

1) మాస్ట‌ర్స్ డిగ్రీ ప్రోగ్రాములు

కోర్సులు: మాస్ట‌ర్ ఆఫ్ కామ‌ర్స్‌, మాస్ట‌ర్ ఆఫ్ ఆర్ట్స్‌, మాస్ట‌ర్ ఆఫ్ లైబ్ర‌రీ అండ్ ఇన్ఫ‌ర్మేష‌న్ సైన్సెస్‌, ఎంసీఏ, మాస్ట‌ర్ ఆఫ్ సైన్స్ త‌దిత‌రాలు.

అర్హ‌త‌: సంబంధిత స‌బ్జెక్టులతో బ్యాచిల‌ర్స్ డిగ్రీ/ హ‌య్య‌ర్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌.

కోర్సు వ్య‌వ‌ధి: క‌నీసం రెండేళ్ల నుంచి గ‌రిష్ఠంగా నాలుగేళ్ల వ‌ర‌కు ఉంటుంది.

2) బ్యాచిల‌ర్స్ డిగ్రీ ప్రోగ్రాములు

కోర్సులు: బ్యాచిల‌ర్ ఆఫ్ ఆర్ట్స్‌, బ్యాచిల‌ర్ ఆఫ్ కామ‌ర్స్‌, బ్యాచిల‌ర్ ఆఫ్ సైన్స్‌, బీసీఏ, బ్యాచిల‌ర్ ఆఫ్ సోష‌ల్‌వ‌ర్క్‌, బీఎస్సీ త‌దిత‌రాలు.

అర్హ‌త‌: ఇంట‌ర్మీడియ‌ట్ (10+2)/ త‌త్స‌మాన ప‌రీక్ష ఉత్తీర్ణ‌త‌.

కోర్సు వ్య‌వ‌ధి: క‌నీసం మూడేళ్ల నుంచి గ‌రిష్ఠంగా ఆరెళ్ల వ‌ర‌కు ఉంటుంది.

3) డిప్లొమా ప్రోగ్రాములు

కోర్సులు: న్యూట్రిష‌న్&హెల్త్ ఎడ్యుకేష‌న్‌, ఈవెంట్ మేనేజ్‌మెంట్‌, డెయిరీ టెక్నాల‌జీ, మీట్ టెక్నాల‌జీ, హార్టిక‌ల్చ‌ర్‌, ఆక్వాక‌ల్చ‌ర్ త‌దిత‌రాలు.

అర్హ‌త‌: ఇంట‌ర్మీడియ‌ట్ (10+2)/ త‌త్స‌మాన ఉత్తీర్ణ‌త‌.

కోర్సు వ్య‌వ‌ధి: క‌నీసం 1 ఏడాది నుంచి గ‌రిష్ఠంగా మూడేళ్ల వ‌ర‌కు ఉంటుంది.

4) పీజీ డిప్లొమా ప్రోగ్రాము‌లు

కోర్సులు: పీజీ డిప్లొమా ఇన్ రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్, ట్రాన్స్‌లేష‌న్‌, అప్లైడ్ స్టాటిస్టిక్స్‌, డిజాస్ట‌ర్ మేనేజ్‌మెంట్‌, ప్రీ ప్రైమ‌రీ ఎడ్యుకేష‌న్ త‌దిత‌రాలు.

అర్హ‌త‌: సంబంధిత స‌బ్జెక్టుల్లో బ్యాచిల‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌.

కోర్సు వ్య‌వ‌ధి: క‌నీసం 1 ఏడాది నుంచి గ‌రిష్ఠంగా మూడేళ్ల వ‌ర‌కు ఉంటుంది.

4) స‌ర్టిఫికెట్ కోర్సులు

కోర్సులు: లైబ్ర‌రీ అండ్ ఇన్ఫ‌ర్మేష‌న్ సైన్స్‌, డిజాస్ట‌ర్ మేనేజ్‌మెంట్‌, ఎన్విరాన్‌మెంటల్ స్ట‌డీస్‌, యాంటీ హ్యూమ‌న్ ట్రాఫికింగ్ త‌దిత‌రాలు.

అర్హ‌త‌: ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త‌. 

కోర్సు వ్య‌వ‌ధి: క‌నీసం 6 నెల‌లు నుంచి గ‌రిష్ఠంగా 2 ఏళ్ల వ‌ర‌కు ఉంటుంది.‌

ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ నిర్వ‌హిస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది: 16.08.2021.
 

Notification Information

Posted Date: 02-08-2021

 

నోటిఫికేష‌న్స్‌ :