• facebook
  • twitter
  • whatsapp
  • telegram

APTET 2024: ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) జులై-2024 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని పాఠశాల విద్యాశాఖ 'ఉపాధ్యాయ అర్హత పరీక్ష' (ఏపీ టెట్ జులై-2024) ప్రకటనను విడుదల చేసింది. దీనికి ఉపాధ్యాయ నియామ‌క ప‌రీక్షలో 20% వెయిటేజీ కూడా ఉంది. పేపర్‌-1ఏ ఎస్జీటీ టీచర్లకు, పేపర్‌-1బీ ప్రత్యేక విద్య ఎస్జీటీ టీచర్లకు నిర్వహించనున్నారు. పేపర్‌-2ఏ స్కూల్‌ అసిస్టెంట్లకు, పేపర్‌-2బీ ప్రత్యేక విద్య స్కూల్‌ అసిస్టెంట్లకు నిర్వహిస్తారు. ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్లకు ప్రత్యేకంగా ఆంగ్ల భాష నైపుణ్య పరీక్ష ఉంటుంది. అభ్యర్థులు 1-5 తరగతుల బోధనకు పేపర్-1(ఎ, బి); 6-8 తరగతుల బోధనకు పేపర్-2(ఎ, బి)లో అర్హత సాధించాల్సి ఉంటుంది. అర్హులైన వారు జులై 17వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. పరీక్షలు ఆగస్టు 5 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నారు. టెట్‌ స్కోర్‌కు జీవిత కాల గుర్తింపు ఉంటుంది. 

పరీక్ష వివరాలు...

* ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) జులై-2024 

అర్హతలు: పేప‌ర్‌ను బ‌ట్టి ఇంట‌ర్మీడియ‌ట్‌, బ్యాచిల‌ర్స్‌ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీతో పాటు డీఈడీ/ బీఈడీ/ లాంగ్వేజ్ పండిట్‌ లేదా త‌త్సమానం. ప్రస్తుత విద్యా సంవ‌త్సరం చివ‌రి ఏడాది చ‌దివే అభ్యర్థులూ అర్హులే.

క‌మ్యూనిటీ వారీ ఉత్తీర్ణతా మార్కులు

1. ఓసీ(జనరల్‌)- 60% మార్కులు ఆపైన‌

2. బీసీ- 50% మార్కులు ఆపైన‌

3. ఎస్సీ/ ఎస్టీ/ పీహెచ్‌/ ఎక్స్ స‌ర్వీస్‌మెన్‌- 40% మార్కులు ఆపైన‌

టెట్‌ ప్రశ్నపత్రాలు: 

* పేపర్‌-1ఎ, పేపర్‌-1బి: 5 విభాగాల్లో 150 ప్రశ్నలు- 150 మార్కులకు నిర్వహిస్తారు. 

* పేపర్‌-2ఎ, పేపర్‌-2బి: 4 విభాగాల్లో మొత్తం 150 ప్రశ్నలు- 150 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.

ప‌రీక్ష విధానం: ఆన్‌లైన్‌లో కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ)గా నిర్వహిస్తారు. రోజుకు రెండు సెషన్లలో ఉంటుంది. మొదటి సెషన్‌ ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు, రెండో సెషన్‌ మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు ఉంటుంది. 

పరీక్ష రుసుము: రూ.750.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో.

ముఖ్య తేదీలు:

నోటిఫికేషన్ విడుదల: 02/07/2024.

దరఖాస్తు రుసుములు చెల్లింపులు: 03/07/2024 నుంచి 16/07/2024 వరకు.

ఆన్‌లైన్‌లో దరఖాస్తుల సమర్పణ: 04/07/2024 నుంచి 17/07/2024 వరకు.

ఆన్‌లైన్ మాక్ టెస్ట్ సదుపాయం: 16/07/2024 నుంచి.

హాల్‌టిక్కెట్ డౌన్‌లోడ్: 25/07/2024 నుంచి.

పరీక్షల నిర్వహణ: 05/08/2024 నుంచి 20/08/2024 వరకు.

ప్రాథమిక ‘కీ’ విడుదల: 10/08/2024.

అభ్యంతరాల స్వీకరణ: 11/08/2024 నుంచి 21/08/2024 వరకు.

తుది ‘కీ’ విడుదల: 25/08/2024.

ఫలితాల ప్రకటన: 30/08/2024.

పరీక్ష సమయం:

సెషన్-1: ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు.
సెషన్-2: మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 వరకు.


మరింత సమాచారం... మీ కోసం!

‣ ఆశావహ దృక్పథంతో ఆశయ సాధన!

‣ స్వల్ప వ్యవధిలో స్థిరమైన ఉపాధి

‣ పవర్‌ గ్రిడ్‌లో 435 ఇంజినీర్‌ ట్రెయినీ ఉద్యోగాలు

‣ తీర రక్షక దళంలో నావిక్‌, యాంత్రిక్‌ కొలువులు

‣ క్లౌడ్‌ కంప్యూటింగ్‌తో అపార అవకాశాలు

‣ పరీక్ష లేకుండానే ఫార్మా కొలువులు


 


Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.

Important Links

Posted Date: 02-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :