• facebook
  • twitter
  • whatsapp
  • telegram

GATE 2025: గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ (గేట్‌)-2025 

దేశంలోని ఐఐటీలు, ఇతర సంస్థల్లో ఎంటెక్‌లో ప్రవేశానికి నిర్వహించే ‘గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌(గేట్‌)-2025’ పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 1, 2, 15, 16 తేదీల్లో జరగనున్నాయి. ఈసారి ఆన్‌లైన్‌ పరీక్షల నిర్వహణ బాధ్యత ఐఐటీ రూర్కీ చేపట్టింది. వెబ్‌సైట్‌ను తాజాగా అందుబాటులోకి తెచ్చింది. మొత్తం 30 సబ్జెక్టుల్లో పరీక్షలు జరగనున్నాయి. ఆగస్టు నెలాఖరులో దరఖాస్తుల ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉంది. గేట్‌ స్కోర్‌ను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలకు సైతం పరిగణనలోకి తీసుకుంటారు. బీటెక్‌ విద్యార్థులు మూడో సంవత్సరం చదువుతున్న వారూ దరఖాస్తు చేసుకోవచ్చు. చివరి సంవత్సరం చదువుతున్న డిగ్రీ విద్యార్థులూ(బీఏ, బీకాం, బీఎస్‌సీ) పోటీపడవచ్చు. గేట్‌ స్కోర్‌ ద్వారా ఎంటెక్‌లో చేరితే నెలకు రూ.12,400ల చొప్పున స్కాలర్‌షిప్‌ అందజేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో ఆ స్కోర్‌ ఉన్నవాళ్లకు ప్రవేశాల్లో తొలి ప్రాధాన్యం ఇస్తారు. ఐఐటీలు గేట్‌ స్కోర్‌తో నేరుగా పీహెచ్‌డీలో కూడా ప్రవేశాలు ఇస్తున్నాయి. 

వివరాలు...

గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ (గేట్‌)-2025

అర్హతలు: ఇంజినీరింగ్‌, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్‌, సైన్స్‌, హ్యూమానిటీస్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 

వయసు: అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితి లేదు.

దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్‌లో పరీక్ష నిర్వహించే ప్రాంతాలు: చీరాల, చిత్తూరు, గుంటూరు, కడప, నెల్లూరు, ఒంగోలు, తిరుపతి, అనంతపురం, కర్నూల్, ఏలూరు, కాకినాడ, సూరంపాలెం, రాజమహేంద్రవరం, తాడేపల్లిగూడెం, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం
తెలంగాణలో పరీక్ష నిర్వహించే ప్రాంతాలు: హైదరాబాద్, మెదక్, నల్గొండ, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, నిజామాబాద్, సూర్యాపేట, వరంగల్‌

పరీక్ష తేదీలు: వచ్చే ఏడాది ఫిబ్రవరి 1, 2, 15, 16 తేదీల్లో జరగనున్నాయి.


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ టెన్త్‌ విద్యార్హతతో ఉద్యోగాలెన్నో్!

‣ సేయిల్‌లో 249 ఉద్యోగాలు!

‣ భవితను నిర్దేశించే... మేలైన ఎంపిక!

‣ అవగాహనతో అధిక మార్కులు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 13-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

నోటిఫికేష‌న్స్‌ :