• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Indian Navy: ఇండియన్ నేవీలో అగ్నివీర్ (ఎస్‌ఎస్‌ఆర్‌) పోస్టులు 

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశ పెట్టిన అగ్నిపథ్‌ స్కీమ్‌లో భాగంగా.. భారత నౌకాదళంలో అగ్నివీర్ ఖాళీల నియామకానికి ప్రకటన వెలువడింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అగ్నివీర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అగ్నివీరులుగా ఎంపికైన అభ్యర్థులకు ఐఎన్‌ఎస్‌ చిల్కాలో ప్రారంభమయ్యే 02/2024 బ్యాచ్‌ పేరున శిక్షణ ఉంటుంది. మే 13 నుంచి దరఖాస్తు ప్రక్రియ మొదలు కానుంది. ఇంటర్‌ ఉత్తీర్ణులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రకటన వివరాలు:

* అగ్నివీర్ (సీనియర్‌ సెకండరీ రిక్రూట్‌- ఎస్‌ఎస్‌ఆర్‌) ఖాళీలు

అర్హత: కనీసం 50 శాతం మార్కులతో మ్యాథ్స్, ఫిజిక్స్‌ ప్రధాన సబ్జెక్టులుగా ఇంటర్మీడియట్‌ (10+2)/ రెండేళ్ల ఒకేషనల్ కోర్సు లేదా ఇంజినీరింగ్ డిప్లొమా (మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఆటోమొబైల్స్/ కంప్యూటర్ సైన్స్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి.

వయస్సు: అభ్యర్థి 01.11.2003 – 30.04.2007 మధ్యలో జన్మించి ఉండాలి. అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేయాలి.

కనిష్ఠ ఎత్తు ప్రమాణాలు: పురుషులు, మహిళలు కనీసం 157 సెం.మీ. ఎత్తు ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: అప్లికేషన్‌ షార్ట్‌లిస్టింగ్, స్టేజ్‌-1 (ఇండియన్‌ నేవీ ఎంట్రన్స్‌ టెస్ట్‌), స్టేజ్‌-2 (రాత పరీక్ష, శారీరక దార్ఢ్య పరీక్ష- పీఎఫ్‌టీ), వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.

శిక్షణ: అగ్నివీరులుగా ఎంపికైన అభ్యర్థులకు ఒడిశా రాష్ట్రంలోని ఐఎన్‌ఎస్‌ చిల్కాలో నవంబర్‌ నెలలో కోర్సు శిక్షణ ప్రారంభమవుతుంది. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న తర్వాత ఆయా విభాగాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

జీత భత్యాలు: ఎంపికైన అభ్యర్థులకు మొదటి ఏడాది రూ.30 వేలు, రెండో ఏడాది రూ.33 వేలు, మూడో ఏడాది రూ.36500, నాలుగో ఏడాది రూ.40 వేల వేతనం లభిస్తుంది.

కంప్యూటర్ ఆధారిత పరీక్ష: ప్రశ్నపత్రం హిందీ/ ఇంగ్లిష్ భాషల్లో మొత్తం 100 బహుళైచ్ఛిక ప్రశ్నలతో ఒక్కొక్కటి 1 మార్కు చొప్పున 100 మార్కులను కలిగి ఉంటుంది. ఇంగ్లిష్, సైన్స్, మ్యాథమెటిక్స్, జనరల్ అవేర్‌నెస్… నాలుగు విభాగాల్లో ఇంటర్మీడియట్‌ స్థాయిలో ప్రశ్నలుంటాయి. పరీక్ష వ్యవధి ఒక గంట. నెగెటివ్ మార్కింగ్ అమలులో ఉంటుంది. నాలుగు తప్పు సమాధానాలకు ఒక మార్కు కోత విధిస్తారు.

దరఖాస్తు ఫీజు: రూ.550.

దరఖాస్తు విధానం: అభ్యర్థులు నేవీ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్య తేదీలు… 

ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు ప్రారంభం: 13-05-2024.

ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు చివరి తేదీ: 27-05-2024.

శిక్షణ ప్రారంభం: 2024, నవంబర్‌ నెలలో.

Some more information 

"From Campus to Millions: The Remarkable Journey of Yasir M."
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 04-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :