• facebook
  • twitter
  • whatsapp
  • telegram

APPSC RIMC: ఏపీపీఎస్సీ- ఆర్ఐఎంసీలో ఎనిమిదో త‌ర‌గ‌తి ప్రవేశాలు 

ఉత్తరాఖండ్‌ రాష్ట్రం దెహ్రాదూన్‌లోని భార‌త ప్రభుత్వ ర‌క్షణ మంత్రిత్వశాఖ‌కు చెందిన రాష్ట్రీయ ఇండియ‌న్ మిలిట‌రీ కాలేజీ(ఆర్ఐఎంసీ)లో జులై-2025 ట‌ర్మ్‌ ఎనిమిదో త‌ర‌గ‌తి ప్రవేశాల‌కు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బాలురు, బాలికల నుంచి ఆంధ్రప్రదేశ్‌ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్(ఏపీపీఎస్సీ) ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. రాత ప‌రీక్ష, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షల ఆధారంగా విద్యార్థుల ఎంపిక ఉంటుంది. అర్హులైన విద్యార్థులు సెప్టెంబర్‌ 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.

వివ‌రాలు..

* ఆర్ఐఎంసీలో ఎనిమిదో త‌ర‌గ‌తి ప్రవేశాలు (జులై- 2025 టర్మ్‌)

అర్హత: గుర్తింపు పొందిన పాఠశాల నుంచి 2025 జులై 1వ తేదీ నాటికి ఏడో త‌ర‌గ‌తి చదువుతున్న లేదా ఏడో త‌ర‌గ‌తి ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులు. 

వ‌య‌సు: 01.07.2025 నాటికి ప‌ద‌కొండున్నర ఏళ్లకు త‌గ్గకుండా ప‌ద‌మూడేళ్లకు మించ‌కుండా ఉండాలి. అంటే 02.07.2012 - 01.01.2014 మ‌ధ్య జ‌న్మించి ఉండాలి.

ఎంపిక విధానం: రాత ప‌రీక్ష, వైవా వోస్‌, మెడిక‌ల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక  ప్రక్రియ ఉంటుంది.

ప‌రీక్షా విధానం: రాత ప‌రీక్షలో మొత్తం మూడు పేప‌ర్లు ఉంటాయి. అవి మ్యాథ‌మేటిక్స్‌(200 మార్కులు), జ‌న‌ర‌ల్ నాలెడ్జ్(75 మార్కులు), ఇంగ్లిష్(125 మార్కులు) నుంచి ప్రశ్నలు ఉంటాయి. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల‌కు వైవా వోస్(50 మార్కులు) నిర్వహిస్తారు. రాత పరీక్ష, వైవా వోస్‌ కలిపి మొత్తం 450 మార్కులకు కేటాయించారు. దీనిలో క‌నీస ఉత్తీర్ణత మార్కులు 50% ఉండాలి‌. ఈ రెండింటిలో అర్హత సాధించిన అభ్యర్థుల‌కు చివ‌రిగా వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.

ద‌ర‌ఖాస్తు ఫీజు: జ‌న‌ర‌ల్ అభ్యర్థుల‌కు రూ.600, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు రూ.555 చెల్లించాలి.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించాలి. ఆర్ఐఎంసీ పంపిన దరఖాస్తు ఫారం నింపి అవసరమైన ధ్రువతపత్రాలు జతచేసి అసిస్టెంట్‌ సెక్రటరీ(ఎగ్జామ్స్‌), ఏపీ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌, న్యూ హెడ్స్‌ ఆఫ్‌ ద డిపార్ట్‌మెంట్స్‌ బిల్డింగ్‌, రెండో అంతస్తు, ఆర్టీఏ కార్యాలయం దగ్గర, ఎంజీ రోడ్డు, విజయవాడ చిరునామాకు పంపించాలి. 

ముఖ్య తేదీలు:

* ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 30.09.2024.

* ప‌రీక్ష తేది: 01-12-2024.

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ అందుకుందాం ఐటీ ఉద్యోగం!

‣ కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో ప్రాజెక్ట్‌ ఆఫీసర్ ఉద్యోగాలు!

‣ గ్రూపు-1 మెయిన్స్‌ 100 రోజుల వ్యూహాం!

‣ అనువర్తన ధోరణిలో అధ్యయనం మేలు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter,Share chatGoogle News Subscribe our Youtube Channel.

Important Links

Posted Date: 20-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

నోటిఫికేష‌న్స్‌ :