• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Postal Department: తపాలా శాఖ - స్పర్ష్‌ యోజన స్కాలర్‌షిప్‌ ప్రోగ్రాం

భారతీయ తపాలా శాఖ 2022-2023 సంవత్సరానికి దీన్‌ దయాళ్‌ స్పర్ష్‌ యోజన స్కాలర్‌షిప్‌ ప్రోగ్రాం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని ద్వారా హాబీగా స్టాంపులలో అభిరుచి, పరిశోధనలో ప్రోత్సాహం కోసం తెలంగాణలోని ఆరో తరగతి - తొమ్మిదో తరగతి విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

* హాబీగా స్టాంపులలో అభిరుచి, పరిశోధనలో ప్రోత్సాహం కోసం స్కాలర్‌షిప్స్‌

మొత్తం స్కాలర్‌షిప్‌లు: 920 (ప్రతి పోస్టల్‌ సర్కిల్‌కు 40 స్కాలర్‌షిప్స్‌ అందజేస్తారు)

స్కాలర్‌షిప్‌ మొత్తం: ఏడాదికి రూ. 6000 (నాలుగు త్రైమాసికాల్లో రూ.1500 చొప్పున) అందజేస్తారు.

అర్హత:  ఆరు నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులు అర్హులు. వీరికి మంచి అకడమిక్‌ రికార్డుతో పాటు తపాలా బిళ్లల సేకరణ హాబీ ఉండాలి. స్కాలర్‌షిప్‌ సమయంలో అభ్యర్థులు ఫైనల్‌ ఎగ్జామ్స్‌లో కనీసం 60 శాతం మార్కులు/ తత్సమాన గ్రేడ్‌ పాయింట్‌ను సాధించి ఉండాలి.

ఎంపిక విధానం: దీనికి ఎంపిక ప్రక్రియ రెండు స్థాయిల్లో జరుగుతుంది. అవి 1) ఫిలాటెలీ రిటన్‌ క్విజ్‌ 2) ఫిలాటెలీ ప్రాజెక్ట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 26.08.2022.

చిరునామా: Assistant Director (Philately), O/o Chief Postmaster General, Telangana Circle, Dak Sadan, Abids, Hyderabad-500001.
 

 

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ సైన్స్‌ బోధనలో.. పరిశోధనలో!

‣ నీకు నువ్వు న‌చ్చ‌ట్లేదా?

‣ ఆరోగ్య రక్షణలో కోర్సుల్లోకి ఆహ్వానం

‣ ఎక్కువ పరీక్షలు రాశా.. తప్పులు సరిచేసుకున్నా!

Notification Information

Posted Date: 27-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

నోటిఫికేష‌న్స్‌ :