2022-23 సంవత్సరానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర సర్వేను ఆర్థికశాఖ తాజా నివేదిక వెల్లడించింది.
వ్యవసాయం, అనుబంధ రంగాల్లో 46 శాతం మందికి ఉపాధి
తెలంగాణలో ఉపాధి అవకాశాలు ఏటేటా పెరుగుతున్నాయని రాష్ట్ర గణాంకాల తాజా నివేదిక వెల్లడించింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, వనరులు, ఉపాధి, ఇతర అంశాలపై అధ్యయన వివరాలను ఈ నివేదికలో వెల్లడించారు. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు 65 లక్షల మంది వివిధ రంగాల్లో ఉపాధి పొందుతున్నారు. ఆ తర్వాత ఈ సంఖ్య క్రమేపీ పెరిగి.. 2021-22 నాటికి 1.5 కోట్లకు చేరింది. వీరిలో అత్యధికంగా 46 శాతం మంది వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ఉపాధి పొందుతున్నారు. వ్యవసాయ పనులు, అనుబంధ వృత్తులు, పాడి, మత్స్య, కోళ్ల పెంపకం తదితర రంగాల్లో వారు పనిచేస్తున్నారు. తర్వాతి స్థానంలో పారిశ్రామిక రంగం ఉంది. ఔషధ, ఇంధన, రసాయన, జౌళి, తయారీ పరిశ్రమల్లో 11 శాతం.. దుకాణాలు, వ్యాపార సముదాయాలు, హోటళ్లు, ఆతిథ్యం, ఇతర వాణిజ్య, సేవా రంగాల్లో 11 శాతం మంది ఉన్నారు. నిర్మాణ, రవాణా రంగాల్లో 9 శాతం మంది చొప్పున పనిచేస్తున్నట్లు నివేదిక వెల్లడించింది.
తెలంగాణ సామాజిక, ఆర్థిక సర్వే 2022-23
Posted Date: 07-02-2023
ఆర్థిక రంగం
లేటెస్ట్ నోటిఫికేషన్స్
విద్యా ఉద్యోగ సమాచారం
- Inter supply exams: మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్షలు
- Sucess : అనారోగ్యంలోనూ అసాధారణ ప్రతిభ
- Latest Current Affairs: 24-04-2024 Current Affairs (English)
- Latest Current Affairs: 24-04-2024 కరెంట్ అఫైర్స్ (తెలుగు)
- APOSS RESULT: ఏపీ సార్వత్రిక పది, ఇంటర్ ఫలితాలు విడుదల
- TSE CET: మే చివరి వారానికి టీఎస్ఈ సెట్‌ను వాయిదా వేయాలి