ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ రంగం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. సాగు పెట్టుబడులు ఏటికేడు పెరుగుతున్నా, రైతుల ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటోంది. వ్యవసాయ పనుల్లో రోబోలను వినియోగిస్తే సాగు వ్యయం భారీగా తగ్గుతుంది. తద్వారా అన్నదాతల కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అనేక రంగాలను ప్రభావితం చేస్తోంది. వ్యవసాయంలోనూ దాని పాత్ర కీలకంగా మారింది. ట్రాక్టర్లతో మొదలైన యాంత్రీకరణ అనేక నూతన ఆవిష్కరణలతో నేడు కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రస్తుతం సాగులో రోబోల విప్లవం మొదలైంది. అభివృద్ధి చెందిన దేశాల్లో వీటి వినియోగం విస్తృతమవుతోంది. మన దేశంలోనూ పూర్తిగా రోబోలతోనే పొలం పనులు చేసే రోజులు రానున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రోబోలను గతంలో పంటకోత దశలోనే ఎక్కువగా ఉపయోగించేవారు. ఇప్పుడు అవి కలుపు తీయడం, విత్తనాలు నాటడం, నేలను విశ్లేషించడం వంటి పనులూ చేస్తున్నాయి. ఫ్రాన్స్, అమెరికా వంటి దేశాల్లో ఉద్యాన పంటల సాగుకు రోబోలను వాడుతున్నారు. 2021లో వ్యవసాయ రోబోల మార్కెట్ పరిమాణం 490కోట్ల డాలర్లు. 2026 నాటికి అది 1120 కోట్ల డాలర్లకు చేరుతుందని అంచనా!
ప్రయోజనాలెన్నో..
వ్యవసాయ రోబోలు అనేవి ఆటొమేటిక్ యంత్రాలు. నిర్దిష్ట పనులు చేయడానికి వీలుగా వీటిని భిన్న ఆకృతుల్లో రూపొందిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వీటి వినియోగం శరవేగంగా పెరుగుతోంది. గ్రీన్‌హౌస్‌లు, పొలాల్లో పండ్లు, కూరగాయలు కోయడానికి, గిడ్డంగుల్లో ఉత్పత్తులను ప్యాకింగ్ చేయడానికి సైతం వీటిని విస్తృతంగా వాడుతున్నారు. సెన్సర్లు, కృత్రిమ మేధ (ఏఐ) వంటి సాంకేతికతలు పరిసరాలకు అనుగుణంగా రోబోలు స్పందించేలా తోడ్పడతాయి. ఆధునిక వ్యవసాయ రోబోలను పత్తి, మిరప, టొమాటో, పొగాకు తదితర పంటలకు అనువుగా తయారు చేస్తున్నారు. దున్నడం మొదలు విత్తనాలు, మొక్కలు నాటడం, పురుగు మందులను పిచికారీ చేయడం, ఎరువులు వేయడం వంటి పనులన్నింటినీ రోబోలు సమర్థంగా పూర్తిచేస్తాయి.
వ్యవసాయ రంగంలో రోబోలను ఉపయోగించడం వల్ల ఇంధనం ఖర్చు తగ్గుతుంది. కూలీల వ్యయం 30-40శాతం ఆదా అవుతుంది. చాలా దేశాల్లో కూలీల కొరత నెలకొంది. మన దేశంలో పంట కోతల నిమిత్తం కూలీలను ఇతర రాష్ట్రాలకు తరలించాల్సి వస్తోంది. రోబోలతో ఈ సమస్యలన్నీ తీరతాయి. సమయమూ ఆదా అవుతుంది. ఒక రోబో 30మంది కూలీలు చేసేంతటి పనిని సమర్థంగా పూర్తిచేస్తుంది. రోబోలతో దిగుబడి పెరగడమే కాకుండా, కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయి. అత్యాధునిక కెమెరాలు, సెన్సర్ల ద్వారా కలుపు మొక్కలు, చీడపీడలను రోబోలు గుర్తిస్తాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ ఇవి పనిచేయగలవు. ధనిక దేశాల్లో విత్తనాలు, మొక్కలు నాటడానికి రోబోలే ఆధారం. గొర్రెల పెంపకానికి, డెయిరీ ఫామ్‌లలో పాలు పితకడానికి సైతం వీటిని ఉపయోగిస్తున్నారు.
సవాళ్లను అధిగమించాలి
రోబోల వాడకంలో అన్నదాతలకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాటిని సమకూర్చుకోవడానికి పెద్దమొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోంది. రోబోల రాకతో కూలీల ఉపాధికి గండి పడుతుంది. వీటిని చిన్న, సన్నకారు రైతులకు అందుబాటులో ఉంచడం కష్టమైన పని. పైగా రోబోల నిర్వహణకు శిక్షణ పొందిన సిబ్బంది అవసరం. సాంకేతిక పరిజ్ఞానం అంతగాలేని రైతులు వీటిని వినియోగించలేరు. సాగు పనులన్నింటినీ ఒకే రోబోతో చేయలేం. పనులను బట్టి వాటిని మార్చాల్సి ఉంటుంది. ఇలా అనేక సవాళ్లు ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా రోబోల ప్రాధాన్యం పెరుగుతోంది. చాలా దేశాల్లో వీటిని విజయవంతంగా వాడుతున్నారు. జపాన్‌లో పంట కోత, నేల విశ్లేషణ వంటి పనుల కోసం రోబోలను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. మన దేశంలో గత అయిదారు సంవత్సరాల నుంచి వీటి వినియోగం స్పల్పంగా పెరుగుతోంది. వ్యవసాయ రోబోల తయారీ రంగంలో అనేక అంకుర సంస్థలు వస్తున్నాయి. వాటికి ప్రభుత్వ పరంగా తోడ్పాటు అవసరమవుతోంది. రైతుల్లోనూ వీటి వాడకంపై ఆసక్తి పెరుగుతోంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని, వ్యవసాయ రోబోలను అందుబాటు ధరల్లో అందించేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. తగిన ప్రోత్సాహం దక్కితే- దేశ వ్యవసాయ రంగంలో రోబోల విప్లవం తొందరలోనే ఆవిష్కృతమవుతుంది.
- దేవవరపు సతీష్
********************************************************
మరింత సమాచారం ... మీ కోసం!
‣ ఒక అభ్యర్థి.. ఒక్కచోటే పోటీ!