విద్యా ఉద్యోగ సమాచారం

  • facebook
  • whatsapp
  • telegram

Andhra News: పాఠశాలలకు 233 రోజులు పనిదినాలు

* అకడమిక్‌ క్యాలెండర్‌ను రూపొందించిన ప్రభుత్వం
 


ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో పాఠశాలలు ఈ విద్యా సంవత్సరంలో 233 రోజులు పని చేయనున్నాయి. మొత్తం 315 రోజులు కాగా.. ఇందులో 82 రోజులు సెలవులు ఉన్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ అకడమిక్‌ క్యాలెండర్‌ను రూపొందించింది. టోఫెల్‌ తరగతుల నిర్వహణపై ప్రభుత్వం జులై 24న నిర్ణయం వెల్లడించనుంది. దీన్ని కొనసాగించడమా? లేదా అనే దానిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 3.30 గంటల వరకు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనున్నాయి. తరగతుల నిర్వహణపై కసరత్తు చేసిన కూటమి ప్రభుత్వం అకడమిక్‌ క్యాలెండర్‌కు తుదిరూపు ఇచ్చింది.  
 

Published at : 24-07-2024 13:18:49

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం