ఈనాడు, అమరావతి: ఉపాధ్యాయ నియామక పరీక్షల(టీఆర్టీ-డీఎస్సీ)ను మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకూ నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్‌కుమార్ తెలిపారు. అభ్యర్థులు సన్నద్ధమయ్యేందుకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)కు డీఎస్సీకి మధ్య 4 వారాల గడువు ఉండాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో షెడ్యూలు మార్చారు. మార్చి 30 నుంచి ఏప్రిల్ 3 వరకూ రోజుకు రెండు విడతలుగా సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్జీటీ) పోస్టులకు పరీక్ష నిర్వహించనున్నారు. ఏప్రిల్ 7న ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్(టీజీటీ), పోస్టుగ్రాడ్యుయేట్ టీచర్(పీజీటీ), ప్రిన్సిపల్ పోస్టులకు ఆంగ్ల భాష ప్రావీణ్య పరీక్ష నిర్వహిస్తారు. ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 30 వరకూ స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీ, వ్యాయామ డైరెక్టర్, ప్రిన్సిపల్ పోస్టులకు పరీక్షలు ఉంటాయి. ఈనెల 20 నుంచి పరీక్ష కేంద్రాల ఎంపికకు అభ్యర్థులు వెబ్ ఐచ్ఛికాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. 25 నుంచి హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం కల్పిస్తారు. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమైతే ఈనెల 15 నుంచి డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.