• facebook
  • whatsapp
  • telegram

APPSC: ఏపీలో 1,423 ప్రభుత్వ కొలువులు  

* దరఖాస్తు, పరీక్ష తేదీలివే..
 

* నోటిఫికేషన్లు జారీ చేసిన ఏపీపీఎస్సీ
 

ఈనాడు ప్రతిభ డెస్క్‌: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ వివిధ ఉద్యోగ ప్రకటనలు జారీచేసింది. డిసెంబర్‌ నెలలో ఏడు ఉద్యోగ ప్రకటనలు వెలువరించింది. డిసెంబర్‌ 31వ తేదీ వరకు 1,423 పోస్టుల భర్తీకి ప్రకటనలు జారీ అయ్యాయి. మరిన్ని పోస్టులకు సంబంధించి ఉద్యోగాలకు ప్రకటనలు విడుదల చేయాలని ఏపీపీఎస్సీ భావిస్తోంది.
 

గ్రూపు-2 ఒక్క పోస్టుకు 446 మందికి పైగా పోటీ...
 

గ్రూపు-2 దరఖాస్తుల స్వీకరణ గడువు తేదీని ఏపీపీఎస్సీ పొడిగించిన విషయం తెలిసిందే. తొలుత ప్రకటించిన ప్రకారం దరఖాస్తుల స్వీకరణ జనవరి 10తో ముగిసింది. అయితే.. ఆన్‌లైన్‌లో పంపడంతో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. సర్వర్‌పై ఒత్తిడి పెరిగి అభ్యర్థులు ఎక్కువ సమయం నిరీక్షించాల్సి వచ్చింది. కొద్దిరోజుల నుంచే ఈ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు స్వీకరణ గడువును జనవరి 17 వరకు పొడిగించినట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి తెలిపారు. తొలుత ప్రకటించిన ఫిబ్రవరి 25వ తేదీన రాత పరీక్ష యథాతథంగా జరుగుతుందని వెల్లడించారు. దరఖాస్తుల స్వీకరణ డిసెంబర్‌ 21 నుంచి ప్రారంభం కాగా ఇప్పటివరకు(జనవరి 9వ తేదీ నాటికి) సుమారు 4 లక్షలమంది పంపారు. గ్రూపు-2 కింద ప్రకటించిన 897 పోస్టుల్ల్లో ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు 331, నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు 566 ఉన్నాయి. ఒక్కొక్క పోస్టుకు 446 మంది (జనవరి 9వ తేదీ నాటికి) పోటీపడుతున్నారు. దరఖాస్తుల స్వీకరణ గడువు తేదీ ముగిసేనాటికి అభ్యర్థుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. 

ఏపీపీఎస్సీ వెలువరించిన ఉద్యోగ ప్రకటనలు ఇలా..

నియామక ప్రకటన        పోస్టులు  దరఖాస్తు తేదీలు  రాత పరీక్ష తేది
గ్రూప్‌-1 సర్వీసు  81   జనవరి 1 - జనవరి 21   మార్చి 17 (ప్రిలిమ్స్‌)
గ్రూప్‌-2 సర్వీసు  897  డిసెంబర్‌ 21 - జనవరి 17   ఫిబ్రవరి 25 (ప్రిలిమ్స్‌) 
పాలిటెక్నిక్‌ లెక్చరర్లు  99  జనవరి 29 - ఫిబ్రవరి 18  ఏప్రిల్/ మే 
డీవైఈవో      38 జనవరి 1 - జనవరి 29 ఏప్రిల్‌ 13 (ప్రిలిమ్స్‌) 
ఏఈఈ ఇంజినీర్  21 జనవరి 30 - ఫిబ్రవరి 19   ఏప్రిల్/ మే
జూనియర్‌ లెక్చరర్లు  47 జనవరి 31 - ఫిబ్రవరి 20  ఏప్రిల్/ మే    
డిగ్రీ లెక్చరర్లు  240 జనవరి 24 - ఫిబ్రవరి 13  ఏప్రిల్/ మే    


ఉద్యోగ ప్రకటనల వివరాల కోసం క్లిక్‌ చేయండి...
 

* ఏపీలో 81 గ్రూప్-1 సర్వీస్‌ పోస్టులు  
 

* ఏపీలో 897 గ్రూప్‌-2 సర్వీసు పోస్టులు 
 

* ఏపీలో పాలిటెక్నిక్ లెక్చరర్‌ పోస్టులు 
 

* ఏపీలో 38 డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టులు 
 

* ఏపీలో 21 అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్ పోస్టులు 
 

* ఏపీలో 47 జూనియర్ లెక్చరర్ పోస్టులు 
 

* ఏపీలో 240 డిగ్రీ లెక్చరర్ పోస్టులు
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 14-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.