* షెడ్యూల్ ప్రకారమే పరీక్షల నిర్వహణ
ఈనాడు ప్రతిభ డెస్క్: తెలంగాణ డీఎస్సీ 2024 హాల్టికెట్లు మరికాసేపట్లో వెబ్సైట్లో అందుబాటులో రానున్నాయి. జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తామని ఇటీవలే విద్యాశాఖ పూర్తిస్థాయి షెడ్యూల్ను ప్రకటించింది. పరీక్షలకు సన్నద్ధం అయ్యేందుకు సమయం చాలా తక్కువ ఇచ్చారని, దానికితోడు గ్రూపు-2 పరీక్షలు ఉన్నందున కనీసం నెలపాటు వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అయితే హాల్టికెట్లను విద్యాశాఖ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని ప్రకటించడంతో పరీక్షల వాయిదా ఉండదని స్పష్టం చేసినట్లయ్యింది. మొత్తం 11,062 ఉపాధ్యాయ ఖాళీలకు డీఎస్సీ నిర్వహిస్తున్నారు.
టీఆర్టీ/డీఎస్సీ తెలంగాణ
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Share chat, Google News Subscribe our Youtube Channel.