* షెడ్యూల్ ప్రకారమే పరీక్షల నిర్వహణ
ఈనాడు, హైదరాబాద్: డీఎస్సీ హాల్టికెట్లను పాఠశాల విద్యాశాఖ అధికారులు జులై 11న రాత్రి వెబ్సైట్లో పెట్టినట్లు పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఈవీ నర్సింహారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు ఆన్లైన్ విధానంలో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అభ్యర్థులు హాల్టికెట్లను www.schooledu.telangana.gov.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టులకుగాను 2.79 లక్షల దరఖాస్తులు చేసుకున్నారు. రాష్ట్రంలో 2017 జులై తర్వాత ఏడేళ్లకు నిర్వహిస్తున్న రెండో డీఎస్సీ అని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.
తెలంగాణ డీఎస్సీ హాల్టికెట్ డౌన్లోడ్ కోసం క్లిక్ చేయండి
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Share chat, Google News Subscribe our Youtube Channel.