* మార్చి 16న ఫలితాలు
ఈనాడు ప్రతిభ డెస్క్: ఐఐటీలు సహా ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో ఎంటెక్, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్) 2024 తుది కీ విడుదలైంది. ఫలితాలు మార్చి 16న విడుదల కానున్నాయి. ఫిబ్రవరి 3, 4, 10, 11 తేదీల్లో దేశంలోని 200 నగరాల్లో పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. గేట్ స్కోర్ ఆధారంగా జాతీయస్థాయిలోని విద్యాసంస్థలే కాకుండా పలు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు ఇంటర్వ్యూలు నిర్వహించి, ఉద్యోగావకాశాలు కల్పిస్తాయి. బెంగళూరు ఐఐఎస్సీ ఈ ఏడాది పరీక్ష బాధ్యత నిర్వహిస్తోంది.
గేట్ 2024 మాస్టర్ ప్రశ్నపత్రాలు, కీ కోసం క్లిక్ చేయండి
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.