ఈనాడు, హైదరాబాద్: గ్రూప్-1 పోస్టులకు దరఖాస్తు గడువు శనివారంతో ముగిసింది. మొత్తం 563 పోస్టులకు 4.03 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ వెల్లడించింది. 2022 గ్రూప్1 నోటిఫికేషన్తో పోలిస్తే ఇప్పుడు మరో 23 వేలు అదనంగా వచ్చాయి. పంపిన దరఖాస్తుల్లో ఏమైనా పొరపాట్లుంటే వాటిని ఆన్లైన్లోనే ఎడిట్ చేసుకునే సదుపాయాన్ని ఈ నెల 23 నుంచి 27 వరకూ కల్పిస్తున్నట్లు కమిషన్ తెలిపింది. ఈ గడువు మళ్లీ పెంచే అవకాశం ఉండదని స్పష్టం చేసింది. పూర్తి వివరాలకు వెబ్సైట్ను సంప్రదించాలని సూచించింది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.